జాతీయ వార్తలు

సీట్లకోసం బిచ్చమెత్తే ప్రసక్తేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సీట్ల కోసం బిచ్చమెత్తే ప్రసక్తేలేదు, గౌరవ ప్రదమైన సీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తే తప్ప కాంగ్రెస్‌తో పొత్తు కుదరదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. మాయావతి మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నత వర్గాల్లోని బీద ప్రజల అభ్యున్నతికి ఎప్పుడూ కృషి చేయలేదు.. ఈ రెండు పార్టీలు అవలంబించిన తప్పుడు విధానాల మూలంగానే ఉన్నత వర్గాల్లోని బీద ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో తమకు గౌరవప్రదమైన సీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని తెగేసి చెప్పారు. లేకుంటే ఒంటరిగానే పోటీ చేసి సత్తాచూపిస్తామని మాయావతి ఆవేశంతో చెప్పారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, ఇతర మైనారిటీలు, ఉన్నత వర్గాల్లోని బీద ప్రజల ఆత్మగౌరవం విషయంలో తమ పార్టీ ఎవ్వరితోనూ రాజీపడదని ఆమె స్పష్టం చేశారు. సంవత్సరాల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా ఉన్నత వర్గాల్లోని బీద ప్రజల అభ్యున్నతికి కృషి చేయలేదని దుయ్యబట్టారు. మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ పెద్దన్నగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని మాయావతి హెచ్చరించారు. కాంగ్రెస్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల విషయంలో వ్యవహరిస్తున్న విధంగానే లోక్‌సభ ఎన్నికల సమయంలో వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆమె హెచ్చరించారు. బీఎస్పీని పక్కన పెట్టి ఇతర చిన్న పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మాయావతి ఈ హెచ్చరిక జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రాంతీయ పార్టీలతో సర్దుకుపోవటం కాంగ్రెస్ బాధ్యత, ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే మంచి ఫలితాలు ఎంతమాత్రం ఉండవని ఆమె స్పష్టం చేశారు. కులతత్వ, మతతత్వ బీజేపీని ఓడించటమే తమ పార్టీ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగాన్ని తమ పార్టీ ఎప్పుడు సమర్థించదని ఆమె తెలిపారు.