జాతీయ వార్తలు

మేక్‌ ఇన్ ఇండియా విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యువకుల కలలను భగ్నం చేసిన ప్రభుత్వ విధానాలు* రాజస్తాన్ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌గాంధీ ధ్వజం
దోల్పూర్ (రాజస్తాన్), అక్టోబర్ 9: బీజేపీ హయాంలో రైతాంగ సంక్షోభం తీవ్రమైందని, రైతులను ఆదుకునేందుకు ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా తుస్సుమందన్నారు. మొబైల్ ఫోన్లు, టీ షర్ట్‌లను చైనా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత్‌లోనే అన్నిరకాల మొబైల్ ఫోన్ పరికరాలను తయారు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దోల్పూర్‌లోనే మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పు రాజస్తాన్‌లో మానియాలో ఆయన 150 కి.మీ రోడ్ షోయాత్రను నిర్వహించారు. దేశంలో శాంతి భద్రతల పరిస్థితులు క్షీణించాయన్నారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా పేదలకు అన్యాయం చేశారన్నారు. రాఫెల్ ఫైటర్‌జెట్స్‌కొనుగోళ్లలో బీజేపీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందన్నారు. దేశానికి తాను సేవకుడిలా పనిచేస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఈ రోజు బడా పెట్టుబడీదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. పేదల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. యువత మోదీని నమ్మి నిలువనా మోసపోయారన్నారు. మోదీ బూటకపుమాటలు నమ్మి మోస పోయిన యువత ఈ రోజు బీజేపీ నేతల హామీలను చూసి నవ్వుకుంటున్నారన్నారు. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీని రక్షించారన్నారు. బడాపారిశ్రామికవేత్తల ప్రయోజనాలే మోదీకి ముఖ్యమన్నారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను పక్కనపెట్టేశారన్నారు. యూపీఏ సర్కార్ గతంలో రైతులకు రూ.70వేల కోట్లరుణాలను మాఫీ చేసిందన్నారు. ఈ రోజు మోదీ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను ఏక పక్షంగా రద్దు చేసిందన్నారు. పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు ఈ ప్రభుత్వం విలువ ఇస్తోందని, రైతులను గాలికివదిలేశారన్నారు. తమ ప్రభుత్వం గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథధకం లాంటి బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం గతంలో రాజస్తాన్‌లో పేదలకు వైద్య సేవల కార్యక్రమం చేపట్టిందన్నారు. వసుంధర రాజే సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్నారు. తాను గత నాలుగేళ్లలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఒకే ఒకసారి వెళ్లానని, రైతుల సమస్యలను ప్రస్తావిస్తే స్పందించలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఈ ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్‌లో తమ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందన్నారు. యువకులు, చిన్న, పేద వర్తకులను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందిస్తామన్నారు. యువతకు మోసం చేసిన మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.