జాతీయ వార్తలు

రైతుకు వెన్ను దన్ను ఎన్డీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంప్లా (హర్యానా), అక్టోబర్ 9: బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని విధంగా రైతాంగానికి మేలు చేపట్టే పనులు అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల గుమ్మం తొక్కాల్సిన అవసరం లేదని, బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు ఇస్తున్నామని చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయన రైతునాయకుడు సర్ చోటూ రామ్ 64 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద రైతు మహానేతను హర్యానాలో ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని, రైతాంగ హక్కుల కోసం పోరాడిన యోధుడు చోటూ రామ్ అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే రైతుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేశారని ఆయన నివాళులు అర్పించారు. బ్రిటీష్ పాలనలో రైతుల హక్కుల సాధనకు ఉద్యమించారన్నారు. రైతులకు గిట్టుబాటుధరలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఖరీఫ్, రబీ సీజన్‌లో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా గిట్టుబాటుధరలను పెంచుతున్నామన్నారు. పంటలకు బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తనాల సరఫరా చేస్తున్నామన్నారు. యూరియా తదితర ఎరువులను సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. గతంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. ఈ రోజు ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరిగేటట్లు గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. హర్యానాలో67లక్షల జన్‌ధన్ అకౌంట్లను తెరిచినట్లు చెప్పారు. వీటి ద్వారా సంక్షేమ పథకాల ఫలాలను జనానికి అందిస్తున్నామన్నారు. బ్యాంకు సేవలను రైతులు, ఇతర వర్గాల ముంగిటకు తీసుకెళ్లామన్నారు. రైతాంగ సమస్యలను గుర్తించి వారు సంక్షోభానికి గురికాకుండా, అశాంతిపాలుకాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతులంటే ప్రేమలేదని వారి సంక్షేమానికి ఏమి చర్యలు తీసుకుందని ఆయన నిలదీశారు. ఎక్కువ కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులను గాలికి వదిలేసిందన్నారు. ఈ రోజు రైతాంగ సమస్యల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. చోటు రామ్ మ్యూజియంను ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ , కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బారాల పాల్గొన్నారు.