జాతీయ వార్తలు

‘లిటిల్ థింగ్స్’తో అభిమానాన్ని పొందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: లక్షలాది మంది దంపతులు ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రసారమైన ‘లిటిల్ థింగ్స్’ ధారావాహిక రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మిథిలాపాల్కర్ తెలిపారు. 2016లో యూ ట్యూబ్‌లో ప్రసారమైన ఈ షోతో రాత్రికి రాత్రే స్టార్‌హోదాను దక్కించుకున్న ఈమె ఇటీవలే ఈ షో రెండో సీజన్ ప్రసారానికి నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదిరిన విషయాన్ని వెల్లడించింది. ఈ షోతో తాను ఇప్పటికే లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని పొందానని తెలిపింది. లిటిల్‌థింగ్స్‌తోనే తన కోస్టార్ ధ్రువతో పరిచయం ప్రారంభమైందని, ఆ షో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ప్రేక్షకులు దీనిని ఎంతో ఆదరించారని, ఈ రెండేళ్లు తమతో పాటు ప్రయాణం చేశారని ఆమె పీటీఐతో తెలిపారు. ఈ షోలో ధ్రువతోతన కెమిస్ట్రీని ప్రేక్షకులు ఇష్టపడ్డారని అన్నారు. నిత్య జీవితంలో దంపతులు ఎదుర్కొనే పలు విషయాలకు సంబంధించిన కథలనే దీనిద్వారా తాము ప్రసారం చేస్తుండటంతో ప్రేక్షకులు పూర్తిగా తమకు కనెక్టు అయ్యారని తెలిపింది. సీజన్ ఒకటిలో పెళ్లికాని ధ్రువ, కావ్య జీవితాలలోని బంధాలు, కేరీర్, ముంబయి లాంటి మహానగరంలో ఎదురయ్యే సమస్యలు, జీవితంలో ఎదుర్కొనే చిన్నచిన్న అంశాలు చూపించామని, ఇక రెండో సీజన్‌కు వస్తే వారి అనుబంధం వల్ల ఎదుర్కొన్న గందరగోళం, అల్లరి సంఘటనలతో నిండి ఉంటుందని అన్నారు. ప్రతి బంధం కూడా పోరాటంతోనే ప్రారంభమవుతుందని, ఇద్దరి మధ్య బంధం పటిష్టంగా ఉన్నా ఇద్దరం రెండు వేర్వేరు మార్గాలలో పయనించడం వల్ల తమ బంధానికి దిశా, దశా లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను ఇందులో చూపుతామన్నారు. నటుడు కారవాన్ మాట్లాడుతూ నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ప్రసారం కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఈ షో ఐదు భాషల్లోకి అనువాదం అయ్యిందని చెప్పారు. లిటిల్ థింగ్స్ సీజన్ టూకి జాతీయ అవార్డు గ్రహీత రుచిర్ అరుణ్ దర్శకత్వం వహించారు.