జాతీయ వార్తలు

18న భూటాన్‌లో ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాఖ (భటాన్), అక్టోబర్ 10: చల్లటి గాలులు, గాలిమరల రెక్కల చప్పుడు, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉండే భూటాన్ దేశం పర్యావరణ పరంగా ఎంతో ఆకట్టుకునే ప్రదేశం. ఎక్కువ భాగం పర్వత శ్రేణులతో నిండి ఉన్న ఈ దేశంలో మూడోసారి ఎన్నికలు ఈనెల 18న జరగబోతున్నాయి. అయితే దేశంలో హరిత విధానాన్ని ప్రవేశపెట్టడానికి భూటాన్ రాజు తీసుకున్న నిర్ణయం ఆ దేశంపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ‘పచ్చని భవిష్యత్’ పెను ఇబ్బందులు తెస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. 72 శాతం అడవులతో నిండివున్న భూటాన్ సాధారణం కన్నా మూడు రెట్లు అధికంగా కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని మానవాళికి ఎంతో మేలు చేస్తోంది. విస్తీర్ణంలో ఇంచుమించు స్విట్జర్లాండ్ దేశంతో సమానంగా ఉండే ఇక్కడి జనాభా సంఖ్య 8 లక్షలు. పర్యావరణ హితంగా ఉండే ఈ ప్రాంతాన్ని దర్శించడానికి అనేకమంది యాత్రికులు వస్తుంటారు. ముఖ్యంగా మే నెలలో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే యాత్రికుల సంఖ్యను పరిమితం చేయడానికి ఆ దేశం తమ దేశం సందర్శించే ప్రతి యాత్రికుడి నుంచి 250 యూఎస్ డాలర్లను ఫీజుగా నిర్ణయించింది. భారత్‌తో రోడ్‌మార్గం ద్వారా కనెక్టివిటీ ఉంది. అయితే ఇతర దేశాల నుంచి నిత్యం ట్రక్కులు, ఇతరవాహనాలు రావడం వల్ల తమదేశంలో కాలుష్యం పెరిగిపోతోందని ఆందోళన చెందుతోంది. ఇక్కడి టింబర్ పరిశ్రమ, వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం వస్తున్నా దేశంలో కనీసం 60 శాతం అడవుల విస్తీర్ణం కలిగి ఉండాలని రాజ్యాంగం నిర్దేశించడంతో కొంత అవరోధం ఏర్పడుతోంది. తమకున్న అపారమైన అటవీ సంపదతో ఎంతో ఆదాయాన్ని ఆర్జించవచ్చునని, కాని దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అడవుల నరికివేతపై ఆంక్షలు విధించినట్టు భూటాన్ ఎన్విరాన్‌మెంట్ కమిషన్‌కు చెందిన దషోపాల్‌జర్ డోర్జి తెలిపారు. అలాగే 11వ పంచవర్ష ప్రణాళిక కింద 2020 నాటికి క్రమంగా వంటచెరకు దిగుమతులను తగ్గించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 100 ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉన్నాయని, వీటి సంఖ్యను పెంచాలని, అలాగే చార్జింగ్ స్టేషన్లను అధికం చేయాలని ఆ దేశం భావిస్తోంది. ట్రాఫిక్ లైట్లు లేని ఏకైక దేశరాజధాని అయిన థింపులో హరితదనం అలరారేలా చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఒకపక్క హెవీవెహికల్స్‌తో రోడ్లను శుభ్రం చేస్తుండగా, మరో పక్క చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే దృశ్యాలు మనకు ఆ దేశంలో కన్పిస్తుంటాయి.