జాతీయ వార్తలు

భయపెట్టేందుకే ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తమ పార్టీని, ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు ఐటీ శాఖాధికారులను ఉసిగొల్పి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని బీజేపీ సర్కార్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విమర్శించింది. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసినందుకు వారి తరఫున న్యాయ పోరాటం చేస్తున్న మంత్రి కైలాష్ గెహ్లాట్‌పై కక్ష్య గట్టి ఇళ్లలో ఐటి అధికారుల చేత సోదదాలు చేయిస్తున్నారని ఆమ్ ఆద్మీపార్టీ ధ్వజమెత్తింది. బుధవారం మంత్రి గెహ్లాట్‌కు చెందిన ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారిని భయపెట్టేందుకు ఐటీ శాఖ చేత దాడులు చేయిస్తున్నారన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఒక వైపు 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి న్యాయపోరాటం జరుగుతోందని ఆ పార్టీ పేర్కొంది. మంత్రి గెహ్లాట్‌కు చెందిన 16 ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణపై గెహ్లాట్ ఇంట్లో తనిఖీలను ఐటి శాఖాధికారులు నిర్వహించారు. ఢిల్లీలోప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుట్ర పన్ని దాడులు చేయిస్తున్నారిని ఆప్ పార్టీ విమర్శించింది.