జాతీయ వార్తలు

విజేతకు సొమ్ము చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పెద్ద కంపెనీలు పోటీ నిర్వహించి బహుమతి ఇవ్వకపోవడంపై సీరియస్ *కోర్టు ఖర్చులు కూడా చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: పెప్సీ కోసం కంపెనీ పోటీల్లో గెలిచిన విజేతకు రూ. 50 లక్షల నగదు బహుమతిని చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. పెద్ద కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల పోటీలు పెట్టడం, విజేతలను ప్రకటించడం, ఆ తర్వాత వారికి బహుమతులను ఇవ్వకపోవడం అలవాటైందని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. పదివేల నష్టపరిహారం, పదివేల రూపాయలు కోర్టు ఖర్చులతో కలిపి 30 రోజుల్లోగా ఢిల్లీకి చెందిన విజేతకు బహుమతిని అందించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కార్పోరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీలుపడి రకరకాల ప పోటీలను నిర్వ్హిస్తున్నాయి. వ్యాపారాలను పెంచుకుంటున్నాయని, కాని విజేతలకు బహుమతులు ఇవ్వడంలేదని వినియోగదారుల కమిషన్ సభ్యుడు ఎన్‌పీ కౌశిక్ చెప్పారు. మార్కెట్లో అనైతిక వాణిజ్య విధానాలు అమలవుతున్నాయని, ఇటువంటి వాటిని సహించేప్రసక్తిలేదని కమిషన్ పేర్కొంది. 2010లో పెప్సీ యంగిస్తన్ కా వోవ్ అనే పోటీని ఈ సంస్థ నిర్వహించింది. తమ కుమార్తె కరిష్మా విజేతగా నిలిచినా బహుమతి ఇవ్వలేదని ఆమె తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా బహుమతిని ఇవ్వమని కూడా తమకు కొంత మంది నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయన్నారు. కొన్ని కంపెనీలు కన్సొలేషన్ బహుమతి ఇస్తున్నాయని, ప్రధానమైన బహుమతిని ఇవ్వడంలేదని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. ఇది మంచి పద్ధతి కాదని కమిషన్ తీర్పులో పేర్కొంది.