జాతీయ వార్తలు

మసీదుల్లో ప్రవేశానికి మహిళలకు అనుమతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 11: అన్ని వయసుల మహిళలకు శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అనుమతినిస్తూ సుప్రీం ఇటీవల వెలువరించిన తీర్పును కేరళకు చెందిన ముస్లిం మహిళా హక్కుల సంస్థ స్ఫూర్తిగా తీసుకుంది. దేశంలోని అన్ని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించడానికి ముస్లిం మహిళలకు అనుమతి ఇస్తూ, ప్రవేశానికి అనుమతి కల్పించాలని కోరుతూ నిసా అనే ప్రోగ్రెసివ్ ఉమెన్ ఫోరం సుప్రీంను ఆశ్రయించనుంది. ఇంతవరకు మసీదుల్లోకి ముస్లిం మహిళలకు అనుమతి లేదు. ఈ ఫోరం కేవలం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశం మాత్రమే కోరడం లేదు, ప్రార్థనలు నిర్వహించడానికి సైతం తమకు అనుమతి ఇవ్వాలని వీరు విజ్ఞప్తి చేయనున్నారు. అంతేకాకుండా మసీదుల్లో తమను ఇమామ్‌లు (పూజారులు)గా సైతం నియమించాలని కోరనున్నారు.
పురుషుల బహుభార్యత్వం, మహిళలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని మతాచారాలకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయిస్తామని నిసా అధ్యక్షురాలు విపి జుహ్రా పీటీఐకి తెలిపారు. మహమ్మద్ గాని, ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ గాని మసీదుల్లోకి మహిళలు ప్రవేశించరాదని, ప్రార్థలు చేయరాదని ఎక్కడా పేర్కొనలేదని ఆమె చెప్పారు. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాకమైనదని ఆమె వ్యాఖ్యానించింది. ఆడైనా, మగయినా రాజ్యాంగం కల్పిచిన హక్కు ప్రకారం తమకు నచ్చిన చోట ప్రార్థనలు చేసుకోవచ్చునని ఆమె అభిప్రాయపడింది.