జాతీయ వార్తలు

మన దగ్గర మంచి డాక్టర్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 11: రాజద్రోహం కేసులో కోర్టు ఎదుట వెంటనే హాజరు కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సకీబ్ నిసార్ మాజీ మిలిటరీ నియంత, దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను ఆదేశించారు. పాకిస్తాన్‌లో మంచి డాక్టర్లు ఉన్నారని ఇక్కడ వైద్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2016 నుంచి ముషార్రఫ్ దుబాయ్‌లో ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు. 2007లో రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు రాజద్రోహ నేరం కింద వివిధ అభియోగాలను ముషార్రఫ్ ఎదుర్కొంటున్నారు. 2016లో వైద్య చికిత్స నిమిత్తం ఆయన దుబాయ్‌కు వెళ్లారు. అప్పటి నుంచి స్వదేశం పాకిస్తాన్‌కు రాలేదు. భద్రత, వైద్య సేవల పేరుతో ముషార్రఫ్ రెండేళ్లుగా పాకిస్తాన్‌కు రావడానికి నిరాకరిస్తున్నారు. ముషార్రఫ్ వివిధ రాజకీయ పార్టీల నేతలపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు. దీని వల్ల వేరే దేశాల్లో ఉన్న రాజకీయ నేతలు పాకిస్తాన్‌కు వచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేందుకు వీలు కల్పించారు. కేసు విచారణ సందర్భంగా ముషార్రఫ్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ అవసరమైతే స్వదేశానికి వచ్చేందుకు తమ క్లైంట్లు సిద్ధంగా ఉన్నారని, వైద్యుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని, అలాగే ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో ముషార్రఫ్ పేరును చేర్చరాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టస్ నిసార్ జోక్యం చేసుకుని దుబాయ్‌లో మంచి డాక్టర్లు లేరని, పాకిస్తాన్‌లో మంచి వైద్య సేవలు లభిస్తాయని, వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని తెలిపారు.