జాతీయ వార్తలు

శబరిమల తీర్పుపై కొనసాగుతున్న నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 11: శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి.
బీజేపీకి చెందిన యువమోర్చా కార్యకర్తలు గురువారం దేవస్థాన మంత్రి ఇంటి వరకు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. యువమోర్చా కార్యకర్తలు ప్రదర్శనగా మంత్రి కడకం పల్లి సురేంద్రనాథ్ ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటికి కొద్ది దూరంలోనే ఆందోళనకారులను పోలీసులు నిలిపివేశారు. అయితే బారికేడ్లను దాటుకుని ఆందోళనకారులు మంత్రి ఇంటివద్దకు చేరుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిపై టియర్‌గ్యాస్, జలగోళాలు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. శబరిమల దేవాలయంపై విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విమర్శలు లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి చేస్తున్న కుట్ర అని సిపిఐ (ఎం) పేర్కొంది. ఈ సంఘటన నేపథ్యంలో ఎల్‌డిఎఫ్ కన్వీనర్ ఎ.విజయరాఘవన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడం, ఇంటిని ముట్టడించడం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కార్యాలయాలపై దాడులను పూనుకోవడం వంటి చర్యలు గర్హనీయమని అన్నారు. ఇది ముఖ్యమంత్రి విజయన్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల విపత్తును సమర్థంగా ఎదుర్కోవడమే కాక, తాము చేపట్టిన పునరావాస, సహాయ కార్యక్రమాలకు మంచి పేరు రావడాన్ని చూసి సహించలేక విపక్షాలు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
శబరిమలపై సుప్రీం ఇచ్చిన తీర్పును సాకుగా చూపుతూ తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై తాము 14 జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసి సుప్రీం తీర్పుపై తమ ప్రభుత్వ, ఎల్‌డిఎఫ్ వైఖరి తెలియజేస్తామని, ఈ నెల 16న ప్రారంభమయ్యే ఈ సభలలో ముఖ్యమంత్రి పినరసి విజయన్ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇలావుండగా, ‘శబరిమలను రక్షించండి’ పేరుతో ఎన్డీఏ ఆధ్వర్యంలో ఆల్‌పుజా జిల్లా నుంచి ప్రారంభమైన ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చిందని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ శ్రీ్ధరన్ పిళ్లై తెలిపారు.