జాతీయ వార్తలు

భారత్, బంగ్లాలపై దాడులకు పాకిస్తాన్ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులు బంగ్లాదేశ్, భారత్‌లపై దాడులకు వ్యూహాలు సిద్ధం చేస్తోందని భారత్ నిఘావర్గాలు హెచ్చరించాయి. ఢాకాలోని హై కమిషన్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్, భారత్‌లోని పశ్చిమబెంగాల్‌పై దాడులకు రంగం సిద్ధమవుతోంది. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ దౌత్యవేత్తల ముసుగులో ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాదం సంస్థలతో సమావేశమై బంగ్లాదేశ్, భారత్‌లపై పెద్దయెత్తున దాడులు నిర్వహించాలని నిర్ణయించాయి. పాకిస్తాన్ హై కమిషన్‌లోని ఒక దౌత్యవేత్త బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో జరిపిన రహస్య చర్చయలలో ఇటీవల కొత్తగా నియమించిన వందమంది ఆత్మాహుతి దళ సభ్యులను పంపుతామని హామీ ఇచ్చారు. వీరిలో కొంతమందిని శిక్షణ ముగిసిన అనంతరం ఉగ్రదాడుల నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కు పంపుతారు. కాగా దౌత్య ముసుగులో బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ కార్యాలయం ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల పాక్ కొత్త రాయబారి రాకను బంగ్లాదేశ్ తిరస్కరించింది. పాకిస్తాన్ హైకమిషన్ కేంద్రంగా భారత్, బంగ్లాదేశ్‌లకు వ్యతిరేకంగా పలు కుట్రలు జరుగుతున్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.