జాతీయ వార్తలు

ఇక ఉపాధి అవకాశాల వెల్లువే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* డిజిటల్ హబ్‌గా అవతరించనున్న భారత్ * దేశంలో 2.5 లక్షల పంచాయతీలకు ఆఫ్టిక్ ఫైబర్ అనుసంధానం
* వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభ సదస్సులో మోదీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉద్యోగాలు, ఉపాధి రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన అవసరం లేదని, దేశంలో ఆర్థిక రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన సంస్కరణల వల్ల ఉద్యోగ రంగం ఊపందుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఇక్కడ ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాల్గవ తరం పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందన్నారు. దీని వల్ల యువతకు సమృద్ధిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలను బ్యాంకులు ఇచ్చే సదుపాయం కల్పించామన్నారు. ఆర్థిక స్వావలంభన, దేశీయ టెక్నాలజీ ద్వారా భారత్‌లో పారిశ్రామిక రంగం, ఆర్థికాభివృద్ధిరేటు పరుగులు తీస్తోందన్నారు. పారిశ్రామిక విప్లవ ఫలితాలును యువతకు, పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు, నైపుణ్యం ఉన్న కార్మికులకు అందించేందుకు సమగ్ర ప్రణాళికలతో కేంద్రం కదులుతోందన్నారు.
ఈ రంగం ద్వారా సామాన్యుడికి లబ్ధి చేకూర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ రంగంలో వౌలిక సదుపాయాల వల్ల టెక్నాలజీలో కొత్త విప్లవం సాధిస్తున్నామన్నారు. భారత్ త్వరలో డిజిటల్ పరిశోధన రంగంలో హబ్‌గా అవతరిస్తుందన్నారు. నాల్గవ పారిశ్రామిక విప్లవానికి భారత్ అందిస్తున్న పరిశోధన, నైపుణ్యం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయన్నారు. ప్రతిభసంపత్తిని సరైన ప్రణాళికలో టెక్నాలజీకి అనుసంధానం చేసి వినియోగించుకోవాలన్నారు. మొదటి, రెండవ పారిశ్రామిక విప్లవ సంస్కరణల దశలో భారత్‌కు ఇంకా స్వాతంత్య్రం రాలేదన్నారు. ఆ దశలో భారత్ స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక సవాళ్లతో ఉందన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ థింగ్స్, బ్లాక్‌చైన్, బిగ్ డేటా లాంటి సాంకేతిక అంశాలు ఐటి రంగాన్ని ముంచెత్తుతున్నాయన్నారు. దేశంలో 50 కోట్ల మంది భారతీయులు మొబైల్ ఫోన్లను కలిగి ఉన్నారన్నారు. ప్రపంచంలో అత్యంత గరిష్ట స్థాయిలో మొబైల్ డాటాను కలిగి ఉన్న దేశం భారత్ అన్నారు. తక్కువ రేటుతో మొబైల్ రీచార్జీ జరుగుతోందన్నారు. మొబైల్ డాటా వినిమయం 30 శాతం పెరిగిందన్నారు. 120 కోట్ల మంది భారతీయులు ఆధార్ కార్డును కలిగి ఉన్నారన్నారు. 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఆఫ్టిక్ ఫైబర్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు. 2014లో కేవలం 59 పంచాయితీలను మాత్రమే ఈ టెక్నాలజీతో అనుసంధానం చేశామన్నారు. ఈ రోజు ఒక లక్ష గ్రామాలకు అనుసంధానం ఉందన్నారు.