జాతీయ వార్తలు

మోదీ అవినీతిపరుడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, అనీల్ అంబానీకి చెందిన రక్షణ ఉత్పత్తుల సంస్థతో ఒప్పందం చేసుకుంటేనే దస్సాల్ట్‌కు రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఇస్తామని మోదీ చెప్పారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు మొదట చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ సెగెలన్ కూడా ఇదే విషయాన్ని బైటపెట్టారని అన్నారు. కాబట్టి అవినీతికి పాల్పడిన మోదీ ప్రధాన మంత్రి పదవి నుండి తప్పుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు.
దాదాపు ముప్ఫై వేల కోట్ల రూపాయల నష్టాల ఊబిలో ఉన్న అనీల్ అంబానీకి ప్రజాధనాన్ని దోచి పట్టేందుకే మోదీ రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును ఇప్పించారంటూ రాహుల్ ఆరోపణల వర్షం కురిపించారు. రాహుల్ పలుమార్లు మోదీని అవినీతిపరుడంటూ ఆరోపించడం గమనార్హం. రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నందుకు నష్టపరిహారంగా అనీల్ అంబానీకి చెందిన రక్షణ ఉత్పత్తుల సంస్థతో ఒప్పందం చేసుకోవాలని మోదీ షరతు విధించారన్న విషయాన్ని దస్సాల్ట్ సంస్థకు సంబంధించిన ఒక రహస్య పత్రం స్పష్టం చేసినట్లు ఫ్రాన్స్‌కు చెందిన మీడియా పాంట్ పత్రిక వార్త రాసిందని రాహుల్ వివరించారు. మోదీ రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థ అధినేత అనీల్ అంబానీకి ముప్ఫై వేల కోట్ల నష్టపరిహారం చెల్లించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడితోపాటు దస్సాల్ట్ సంస్థలోని రెండో అతిపెద్ద అధికారి సెగెలన్ బైటపెట్టారని రాహుల్ తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా మోదీ మాత్రం నోరు మెదపడం లేదన్నారు. మరోవైపు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్‌లో ఎందుకు పర్యటిస్తున్నారని ఆయన నిలదీశారు. అంత అత్యవసరం ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణాన్ని తొక్కిపెట్టేందుకే ఆమె ఫ్రాన్స్ వెళ్లారని, దస్సాల్ట్ కార్మాగారానికి కూడా వెళ్లారంటే అక్కడ ఏం జరుగుతోందనేది మీరే ఊహించుకోవచ్చునని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘అనీల్ అంబానీ సంస్థలు 45వేల కోట్ల అప్పుల ఊబిలో ఉన్నాయి. ఆయనకు చెందిన రక్షణ ఉత్పత్తుల సంస్థ గతంలో ఎన్నడూ యుద్ధ విమానాలను తయారు చేయలేదు. హెచ్‌ఏఎల్‌కు చెందవలసిన ముప్ఫై వేల కోట్ల రూపాయలను అనీల్ అంబానీ జేబులో వేశారు. మోదీ దేశానికి కాకుండా, కేవలం అనీల్ అంబానీకి ప్రధాన మంత్రిగా మారారు’ అని రాహుల్ ధ్వజమెత్తారు. ఫ్రాన్స్‌తో కుదిరిన రహస్య ఒప్పందంలో యుద్ధ విమానాల ధర గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు. అనీల్ అంబానీకి నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం ఏమిటని నిలదీశారు. అవినీతిపై పోరాడుతానంటూ అధికారంలోకి వచ్చిన మోదీ అవినీతిపరుడుగా మారాడంటూ దుయ్యబట్టారు. మోదీ వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాడంటూ ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చేసిన వ్యాఖ్య గురిం చి విలేఖరులు ప్రస్తావించగా, తన మాటలను వక్రీకరించారని పవార్ అప్పుడే వివరణ ఇచ్చారు కదా? అని రాహుల్ ఎదురు ప్రశ్న వేశారు.
పవార్ ఏం చెప్పారన్నది ఇప్పుడు ముఖ్యం కాదని, మోదీ స్వయంగా అవినితికి పాల్పడ్డారనేది ఇప్పుడు రూఢీ అయిందని అన్నారు. భారత ప్రధాని అవినీతిపరుడని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు, దస్సాల్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారనీ, నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్‌కు వెళ్లారని పేర్కొంటూ ‘మీకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి’ అని ఆయన విలేఖరులను అడిగారు.