జాతీయ వార్తలు

మార్గదర్శికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ డిపాజిట్ల వ్యవహారంపై వివిధ కోర్టుల్లో నమోదైన క్రిమినల్ కేసుల విచారణపై స్టే కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే దీనిపై ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇచ్చింది. మార్గదర్శి సంస్థ డిపాజిట్లకు సంబంధించిన హైదరాబాద్ మొదటి అదనపుచీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, సిటీ క్రిమినల్ కోర్టులో కేసులున్నాయి. విచారణ కొనసాగింపుపై స్టే ఇవ్వాలని మార్గదర్శి సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం పిటిషన్లను విచారించింది. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారంలో విచారణపై స్టే ఇవ్వాలని 2011లో హైకోర్టు ఆశ్రయించారు. 2011 జూ లై 20న మరో క్రిమినల్ పిటిషన్‌లో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు సివిల్, క్రిమినల్ కేసు స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని ఆదేశా లిచ్చింది. దీంతో ప్రకారం మార్గదర్శి కేసులోనూ స్టే ఉత్తర్వులకు కాలం చెల్లింది. తమ స్టేను కొనసాగించాలని సంస్థ సుప్రీంను ఆశ్రయించగా చుక్కెదురైంది. మార్గదర్శి పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. విచార ణ సం దర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తరఫున న్యాయవాది అల్లంకి రమేష్, మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వం తరపున న్యా యవాది వెంకటరెడ్డి హాజరయ్యారు.