జాతీయ వార్తలు

పారికర్ తప్పుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: గోవాలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమై సంఖ్యాబలం తమకు ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి పారికర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని , ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోదంకర్ మాట్లాడుతూ సీఎం పారికర్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తే రాఫెల్ స్కాం వివరాలు బహిర్గతం చేస్తారనే భయం బీజేపీని వెంటాడుతోందన్నారు. రాష్ట్రంలో పాలన స్తంభించిందని, ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని వారు ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. గోవాలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని రకాల అడ్డదార్లను బీజేపీ తొక్కిందన్నారు. బీజేపీకి అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. గోవా ప్రజలు కాంగ్రెస్‌ను పాలించమని ఓటు వేశారన్నారు. కాని దొడ్డిదారి ద్వారా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. గోవా అసెంబ్లీకి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు గవర్నర్‌నుక ఓరారు. గోవాకు పూర్తిస్థాయి ముఖ్యమంత్రి కావాలన్నారు. రాఫెల్ ఒప్పందంపై పారికర్ వద్ద బోలెడు సమాచారం ఉందన్నారు. పదవి నుంచి తప్పిస్తే రాఫెల్ రహస్యాలు ఎక్కడ బయటపెడతారేమోనన్న భయం బీజేపీ నేతలను వెంటాడుతోందన్నారు. పారికర్‌కు అవినీతి రహస్యాలు తెలుసన్నారు. ఢిల్లీలో కేబినెట్ మీటింగ్ పెట్టడమేంటని వారు నిలదీశారు. గోవా అసెంబ్లీలో 40 సీట్లు ఉన్నాయి. ఇందులో పారికర్ ప్రభుత్వానికి 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంజీపీ పార్టీకి ముగ్గురు, ఇండిపెండెంట్లు ముగ్గురు బీజేపీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్‌కు 16 సీట్లు ఉన్నాయి.