జాతీయ వార్తలు

హెచ్‌ఏఎల్‌కు మోదీ ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం * బెంగళూరు సదస్సులో రాహుల్ ధ్వజం
బెంగళూరు, అక్టోబర్ 13: రాఫెల్ ఫైటర్ జెట్స్ ఒప్పందాన్ని ఎండగడుతామని, బీజేపీ అవినీతిని పెకిలిస్తామని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ కంపెనీకి రక్షణ రంగ విడిభాగాలు తయారుచేసే సత్తా ఉందని, కాని ప్రధాని మోదీ ఈ సంస్థకు ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన హాల్ ఉద్యోగుల సదస్సులో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం ఒక క్రమ పద్ధతి ప్రకారం దేశంలో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. మోదీ ధ్వంస రచన వల్ల ఈ వ్యవస్థలు బలహీనపడుతున్నాయన్నారు. హాల్‌కు 78 ఏళ్ల చరిత్ర ఉందన్నారు.
రాఫెల్ ఫైటర్ జెట్స్ హాల్ హక్కు అన్నారు. ఈ విమానాల విడిభాగాలను తయారు చేసే నైపుణ్యం మన ఉద్యోగులకు ఉందన్నారు. హాల్‌కు అంత నైపుణ్యం లేదని ప్రధాని మోదీ పేర్కొనడం దారుణమన్నారు. అవినీతి ఊబిలోకూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి రాఫెల్ స్కాంపై మాట్లాడే హక్కు లేదన్నారు. లోక్‌సభలో ఈ అంశంపై నిలదీస్తే మోదీ బదులివ్వలేదన్నారు. గతంలో దేశం గర్వించదగిన రక్షణ రంగ సంస్థ హాల్ అన్నారు. ఈ రోజు హాల్ సంస్థ ఉద్యోగుల ప్రతిభను గుర్తించరా అని ప్రశ్నించారు. ఏరోస్పేస్ రంగంలో ఈ సంస్థకు విశిష్టత ఉందన్నారు. ఈ సంస్థకు అనుభవం లేదని రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పడం దారుణమన్నారు. అన్ని అర్హతలు ఉన్న హాల్‌ను మోసం చేయడం తగదన్నారు. ఈ సంస్థ ఉద్యోగుల మనోభావాలను ప్రతిభను అవమానించారన్నారు. 78 ఏళ్ల ఘన చరిత్ర హాల్‌కు ఉందని, కాని బీజేపీ సర్కార్ తీరు చూస్తుంటే మన ప్రతిభను మనమే నాశనం చేస్తున్నట్లు కనపడుతోందన్నారు. ఏ మాత్రం గౌరవం ఉన్నా హాల్ ఉద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ సర్కార్‌లో అవినీతి పెచ్చుమీరిందన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ బీజేపీ అసమర్థత, అవినీతికి పరాకాష్ట అన్నారు. అనిల్ అంబానీ కంపెనీకి ఏమి గౌరవం, అనుభవం ఉందని ఆయన నిలదీశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి జాతి ప్రతిష్టను ఇనుమడింపచేస్తామన్నారు.