జాతీయ వార్తలు

అద్వితీయ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత విభాగం మానవ హక్కుల మండలి సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత్ ఎన్నికైంది. ఈ పదవీ కాలం మూడేళ్ల పాటుంటుంది. 2019 జనవరి 1వ తేదీ నుంచి 2021 వరకు భారత్‌కు మానవ హక్కుల సంస్థలో సభ్యత్వం ఉంటుంది. భారత్‌కు 188 ఓట్లు పోలయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం కావాలంటే కనీసం 97 దేశాల మద్దతు ఉండాలి. ఆసియా పసిఫిక్ కేటగిరీ దేశాల నుంచి ఈ మండలిలో సభ్యత్వం కోసం భారత్ పోటీ పడింది. భారత్‌తో పాటు బెహరెన్, బంగ్లాదేశ్, ఫిజీ, ఫిలిప్పైన్స్ దేశాలు ఈ మండలిలో సభ్యత్వం కోసం పోటీ పడ్డాయి. ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ఇచ్చాయని, దీనిని బట్టి భారత్‌కు ప్రపంచ స్థాయిలో ఉన్న పరపతి తెలుస్తుందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. పెద్ద ఎత్తున వివిధ దేశాలు భారత్‌కు మద్దతు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. మానవ హక్కుల మండలిలో భారత్‌కు సభ్యత్వం లభించడం వల్ల భారత్ ఔన్నత్యం పెరిగిందన్నారు. ఎక్కువ ఓట్లతో భారత్ గెలిచిందన్నారు. భారత్ 2011-14, 2014-17లో కూడా మానవ హక్కుల మండలికి ఎన్నికైంది. రెండు సార్లు వరుసగా ఎన్నికైన తర్వాత వెంటనే ఎన్నికయ్యేందుకు వీలు లేదు. అందుకే ఒకసారి విరామం ఇచ్చిన తర్వాత మళ్లీ భారత్ ఎన్నికైంది. మానవ హక్కుల మండలిలో 47 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. జనాభా, భౌగోళిక ప్రాంతాన్ని బట్టి సభ్యత్వాన్ని ఖరారు చేస్తారు. ఆఫ్రికా దేశాలకు 13 సట్లు, ఆసియా పసిఫిక్ దేశాలకు13సీట్లు, తూర్పు ఐరోపా రాష్ట్రాలకు ఆరు సీట్లు,లాటిన్ అమెరికా, కరేబియన్ రాష్ట్రాలకు ఎనిమిది సీట్లు, పశ్చిమ ఐరోపా ఇతర దేశాలకు ఏడు సీట్లు ఉంటాయి. మానవహక్కుల మండలి హైకమిషనర్‌గా గత ఏడాది చీలీ మాజీ అధ్యక్షుడు మెగాల్ బెచిలెట్ ఎన్నికయ్యారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల కు భంగం వాటిల్లుతుందంటూ ఇటీవల మానవ హక్కుల మండలి నివేదిక ఇచ్చిన విషయం విదితమే. కాని ఈ నివేదికను భారత్ తిరస్కరించింది.