జాతీయ వార్తలు

శుష్క వాగ్దానాలు ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, అక్టోబర్ 14: రాజస్థాన్‌లో అధికార బీజేపీలా శుష్కవాగ్ధానాలు ఇవ్వబోమని పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమలుకాని హామీలు ఉండవని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఆదివారం ఇక్కడ సమావేశమైంది. సమావేశానంతరం పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సూచనలు, సలహాలను తీసుకుని మేనిఫెస్టో రూపొందిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ అమలుకాని హామీలు ఇవ్వబోదని ఆయన భరోసా ఇచ్చారు. ‘అబద్ధాలు, అభూతకల్పనలు, తప్పుడు లెక్కలు చెప్పి జనాన్ని అయోమయానికి గురిచేయం’ అని పైలట్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టతతో ఉంటుందని ఆయన తెలిపారు. అమలయ్యే హామీలే ఇస్తామని పీసీసీ చీఫ్ అన్నారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలుపై దృష్టిపెడతామని పైలట్ చెప్పారు. ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, అవినాష్ పాండే, రమేశ్వర్ డూడీ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యూహాత్మంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని, దానికి సంబంధించి విధి విధానాలు సమావేశంలో చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కమిటీని వికేంద్రీకరణ చేసి ఏడు డివిజన్లలో వినూత్నంగా నిర్వహిస్తామని పైలట్ వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ కక్ష సాధింపుచర్యలుండవని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల హామీలను అమలుచేస్తూ ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తామని పీసీసీ చీఫ్ చెప్పారు.