జాతీయ వార్తలు

ఎన్‌డీ తివారీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ (93) గురువారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన తివారీ మధ్యాహ్నం 2.50కి మృతి చెందారు. తివారీ పుట్టిన రోజు అక్టోబర్ 18. అదే రోజు ఆయన కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుల్లో ఆయనొకరు. ఇందిరాగాంధీకి సన్నిహితుల్లో ఒకరుగా ఉండేవారు. 1990కి ముందు ఓ సందర్భంలో ప్రధాన మంత్రి పదవి కోసం తివారీ పేరు కాంగ్రెస్ అధినాయకత్వం పరిశీలించింది. కాంగ్రెస్‌లో అనేక ఉన్నత పదవులు చేపట్టిన ఆయన 1994లో పార్టీని వీడి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అర్జున్‌సింగ్‌తో కలిసి పార్టీ స్థాపించిన ఆయన సోనియాగాంధీ అధ్యక్షురాలు అయ్యాక తిరిగి కాంగ్రెస్‌లో
చేరారు. రాజీవ్‌గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా, మూడు సార్లు యూపీ, ఒక సారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీ తివారీ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గానూ ఆయన పనిచేశారు. ఆరోగ్య కారణాలతో 2009లో రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్‌లో జన్మించిన తివారీ రాష్ట్భ్రావృద్ధికి ఎనలేని కృషి చేశారని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పష్టం చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆయన మ్యాక్స్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లోనూ, విభజన తరువాత ఉత్తరాఖండ్‌లో సీఎంగా పనిచేసిన ఘతన తివారీకి దక్కుతుంది. ఎన్‌డీ తివారీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్‌ను పారిశ్రామికంగా, అభివృద్ధిపరంగా ఎంతో కృషి చేశారని ఆయన శ్లాఘించారు.
కాగా తివారీ పార్థీవదేహాన్ని శనివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు తరలించనున్నారు. విధాన్ భవన్‌లో ప్రజల సందర్శనార్ధం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ ఉంచుతారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ సహచరులు లక్నో విమానాశ్రయానికి వెళ్లి తివారీ మృతదేహాన్ని విధాన్ భవన్‌కు తీసుకొస్తారు.