జాతీయ వార్తలు

అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 72మందికి తీవ్ర గాయాలు *పెను విషాదమైన దసరా ఆనందం
* ప్రధాని, రాష్టప్రతి సంతాపం * బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
అమృతసర్, అక్టోబర్ 19: దసరా ఆనందం పంజాబ్‌లో పెను విషాదాన్ని మిగిల్చింది. రెండు రైళ్లు మృత్యు శకటాలయ్యాయి. ఓ రైలు జనం మీద నుంచే దూసుకెళ్లి పోయింది. మరో రైలు ఎవరూ తప్పించుకునే అవకాశమే లేకుండా చేసింది. ఏమి జరిగిందో తెలుసుకునే లోగానే 52మంది విగత జీవులైపోయారు. మరో 72 మంది తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. క్షణం ముందు వరకూ ఆనందోత్సాహాలతో నిండిన ఆ ప్రాంతం రక్తపుమడుగైంది. తెగిన శరీర మృత దేహాలతో నిండిపోయింది. దసరా ఉత్సవాల సందర్భంగా అమృతసర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జోడా ఫతక్ ప్రాంతంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి వందల సంఖ్యలో జనం తరలివచ్చారు. రావణాసురుడి దిష్టి బొమ్మ దహన మవుతూండగా పెద్ద సంఖ్యలో బాణసంచానూ పేల్చారు. ఆ హోరులో, ఆనందంలో మునిగిపోయిన జనానికి తాము నిల్చున్న పట్టాల మీదుగానే ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్ల శబ్దమే వినపించలేదు. ఈ ప్రాంతానికి సమీపంలోనే రైల్వే లైన్లు ఉండటంతో అక్కడే చాలా మంది ఉండిపోయి రావణ దహనాన్ని తిలకించడంతో ఈ ఘోర విపత్తు జరిగిపోయింది.జలంధర్ నుంచి అమృతసర్ వెళుతున్న రైలు వీరి పాలిట మృత్యుశకటమైంది. మరో వైపు నుంచి రెండో రైలు కూడా వస్తూండటంతో ఎవరికి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. హృదయాన్ని ద్రవించే ఈ దుర్ఘటనలో 52మంది మరణించారని, మరో 72మంది గాయపడ్డారని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజేశ్ శర్మ తెలిపారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామన్నారు. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా కూడా పేల్చడంతో ఆ దృశ్యాన్ని చూస్తూ పట్టాలపై ఉండిపోయిన వారికి రైళ్లు వస్తున్న శబ్ధం కూడా వినిపించలేదని అధికారులు తెలిపారు. మరో వైపు నుంచి అదే సమయంలో రెండో రైలూ రావడం వల్ల ఎటూ తప్పించుకోలేక 52మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. ఛిద్రమైన మృత దేహాలను కొద్ది దూరం పాటు రైలు తీసుకుపోయిందని, చాలా మందిని గుర్తించే పరిస్థితే లేదని తెలిపారు. ఈ సంఘటనతో గుండెపగిలిన జనం ఆర్తనాదాలతో ఆ ప్రాంత మంతా నిండిపోయింది. క్షణం క్రితం ఆనందం కాస్త పెను విషాదమై గుండెలు పిండేసింది. మృతుల్లో చాలా మంది పిల్లలూ ఉన్నారు. సంఘటన జరిగిన తర్వాత కూడా రైలు పట్టాలపైనే బైఠాయించిన జనం అధికారులపై నిప్పులు చెరిగారు. మృత దేహాలను తొలగించడానికి వీల్లేదంటూ గంటల తరబడి వారిని అడ్డుకున్నారు. తెగిన శరీర భాగాలతో పడి ఉన్న మృత దేహాల్లో ఎవరూ తమవారో గుర్తించలేక గుండెలు పగిలేలా ప్రజలు రోదించారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 300 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. సంఘటన జరిగిన వెంటనే తాను ఆసుపత్రికి తరలి వెళ్లానని తర్వాత మీడియాకు కౌర్ తెలిపారు. 3నా చిన్నారి ఏమైందో తెలీదు..నాకు నా పాప కావాలి2అంటూ ఓ తల్లి గుండెలు బాదుకోవడం కనిపించింది. దసరా ఉత్సవాలకు ఫటక్ ప్రాంతమే వేదిక కాబట్టి ఆ సమయాల్లో రైళ్ల వేగాన్ని తగ్గించాలని రైల్వే అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు తాము ఎన్ని సార్లు అభ్యర్థించినా ప్రయోజనం లేకపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విభజన సమయంలో జరిగిన హింసాకాండ దృశ్యానే్న నేటి రైలు ప్రమాద ఘటన తలపింపజేస్తోందని పేర్కొన్నారు. దుర్ఘటన ప్రాంత మంతా గంటల తరబడి తేరుకోలేనంతగా విషాదంలో మునిగిపోయింది. ఔనా, నిజమా అన్న దిగ్భ్రాంతి సర్వత్రా కనిపించింది. కలలో కూడా ఊహించని ఈ ఘోర సంఘటన దేశ వ్యాప్తంగా హాహాకారాలు రేపింది.

మోదీ, కోవింద్ దిగ్భ్రాంతి
ప్రధాని మోదీ, రాష్టప్రతి కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. ఈ దుర్ఘటనను తలచుకుంటేనే గుండెను పిండేస్తోందని ట్వీట్ చేశారు. అమృతసర్ రైలు పట్టాలపై జరిగిన ఈ ఘోర సంఘటన తనకు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించిందని రాష్టప్రతి కోవింద్ అన్నారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స చేయిస్తామన్నారు.