జాతీయ వార్తలు

‘నీట్’పై సుప్రీంలో ఎపి, తెలంగాణ వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సులో ప్రవేశానికి కేంద్రం నిర్వహించే ‘నీట్’ (జాతీయ స్థాయి అర్హత పరీక్ష) నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆర్టికల్ 370 అమలులో ఉన్నందున ఇతర రాష్ట్రాల వారికి మెడికల్ సీట్లను కేటాయించడం కుదరదని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు కోర్టుకు నివేదించాయి. సిబిఎస్‌ఇ సిలబస్ ఆధారంగా జరిగే ‘నీట్’కు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సిద్ధం కాలేరని, ఇందుకు కొంత వ్యవధి అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, తెలుగురాష్ట్రాల వాదనను కోర్టు అంగీకరించలేదు. ‘నీట్’పై మరికొన్ని రాష్ట్రాలు కూడా పిటిషన్లు వేసినందున ఈ విషయమై మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపి తీర్పు ఇస్తామని సుప్రీం ప్రకటించింది.