జాతీయ వార్తలు

నీట్ నుంచి మినహాయింపుకోరిన పలు రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ అడ్మిషన్లకు నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు కావాలని పలు రాష్ట్రాలు కోరాయని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జెపి నడ్డా సోమవారం తెలిపారు. నీట్‌పై ఇక్కడి ఎయిమ్స్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. నీట్‌కు సూత్రప్రాయంగా అన్ని రాష్ట్రాలూ సమ్మతించినా, ఈ ఏడాదికి మినహాయింపు అడిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. సిబిఎస్‌ఇ, రాష్ట్రాల సిలబస్‌కు వ్యత్యాసం ఉందని పలు రాష్ట్రాల మంత్రులు నడ్డా దృష్టికి తెచ్చారు. కాగా, ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ దాదాపు 20 రాష్ట్రాలు కోరాయని ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రెండేళ్లు గడువు ఇవ్వాలని తాను విజ్ఞప్తి చేసినట్లు, ప్రాంతీయ భాషల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ను మంచి అనువాదంతో ముద్రించాల్సి ఉందని ఆయన చెప్పారు.