జాతీయ వార్తలు

నేతాజీ దస్త్రాలను విడుదల చేయనున్న జపాన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించి రెండు కీలకమైన దస్త్రాలను జపాన్‌ విడుదల చేయనుంది. మరో మూడు దస్త్రాల విడుదలపై ఆ దేశం ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో తెలిపారు. జపాన్‌ వద్ద ఉన్న ఐదు దస్త్రాలు చాలా కీలకమైనవని, మిగతా వాటిని కూడా ఆ దేశం విడుదల చేస్తుందన్న నమ్మకం తమకుందని మంత్రి తెలిపారు. నేతాజీకి సంబంధించి ఇప్పటి వరకు సుమారు 150 దస్త్రాలను విడుదల చేశామని.. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.