జాతీయ వార్తలు

‘నీట్’ ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సులకు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష (నీట్)ను ఈ ఏడాదికి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఎట్టకేలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఆర్డినెన్స్‌పై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఆయన సంతకం చేశారు. విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ఆర్డినెన్స్‌పై రాష్టప్రతి సంతకం చేయడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జెపి నడ్డా సోమవారం ప్రణబ్‌ను కలిసి ఆర్డినెన్స్ అవసరాన్ని వివరించారు. ‘నీట్’ నుంచి ఈ ఏడాది మినహాయింపు కావాలని రాష్ట్రాలు కోరాయని ఆయన రాష్టప్రతికి తెలిపారు.