జాతీయ వార్తలు

నేతాజీకి చెందిన మరో 25 పత్రాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ మరణ మిస్టరీకి సంబంధించిన మరో 25 రహస్య పత్రాలను www.netajipapers.gov.in అనే వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేష్ శర్మ శుక్రవారం తెలిపారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 23న వంద రహస్య పత్రాలను బయటపెట్టారు. దీనికి ముందు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా తన వద్ద ఉన్న నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేసింది. దీంతో నేతాజీకి సంబంధించి ఇప్పటి వరకు 150 పత్రాలు ప్రజల ముందుకొచ్చాయి.