జాతీయ వార్తలు

ఆపద్బంధువు ‘సోషల్ మీడియా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్షణ సాయం కోసం ఇ-సైట్లను ఎంచుకున్న చెన్నై నెటిజన్లు
చెన్నై, డిసెంబర్ 6: వర్షబీభత్సానికి అతలాకుతలమైన చెన్నై నగరంలో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు సాయం కోసం సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్‌యాప్‌లాంటి సామాజిక నెట్‌వర్క్ సైట్లు అపద్బంధువు పాత్ర పోషించాయి. చాలామంది నెటిజన్లు ఈ మాధ్యమం ద్వారా స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకు రాగా, మరికొందరు ఎక్కడో దూరంగా ఉన్న తమ ప్రియతములతో సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాంబరం సమీపంలోని ముదిచుర్ ప్రాంతంలో పురిటి నొప్పులు పడుతున్న ఓ గర్భిణీకి సాయాన్ని కోరుతూ శ్రేయాసి ఘోష్ అనే మహిళ తన ట్విట్టర్‌లో మెస్సేజ్ పెట్టగానే, ఆ మెస్సేజి చూసిన చాలామంది సాయం అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడమే కాక ఆ మహిళను దగ్గర్లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు కూడా. అంతేకాదు, ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చిందనే సమాచారాన్ని కూడా ట్విట్టర్ సైట్స్‌లో ఉంచారు. మరికొంతమంది అయితే పాలు, నీళ్లు, బట్టలు, టవళ్లు లాంటి నిత్యావసర సరకులు ఎక్కడ చౌకగా దొరుకుతాయనే సమాచారాన్ని కూడా తమ ట్విట్టర్‌లో ఉంచడం ద్వారా బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నించారు. దాదాపుగా అన్ని రవాణా సదుపాయాలు నిలిచిపోయి, ఇంట్లోనుంచి బైటికి కాలుపెట్టటలేని స్థితిలో ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు ప్రజలకు ఓ అనుకోని వరంలాగా పరిణమించాయి.