క్రీడాభూమి

నెట్స్‌లో పాక్ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 13: చివరి వరకూ అనుమానాస్పదంగా కనిపించిన పర్యటన ఖరారై, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి శనివారం రాత్రి ఇక్కడికి చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆదివారం ఉదయం నెట్స్‌లో బిజీగా గడిపింది. ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న పాక్ జట్టుకు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ వంటి అనుభవజ్ఞుడు కోచ్‌గా వ్యవహరిస్తుండడం అదనపు బలాన్నిస్తున్నది. షోయబ్ మాలిక్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ హఫీజ్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. 16న జరిగే టి-20 వరల్డ్ కప్ సూపర్-10లో మొదటి మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్ 19న భారత్‌తో జరిగే పోరు కీలకంగా మారనుంది. యుద్ధపూరిత వాతావరణంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భద్రతా కారణాల పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), లిఖితపూర్వక హామీ కావాలంటూ ప్రభుత్వం భీష్మించుకోవడంతో పాక్ జట్టు టి-20 వరల్డ్ కప్‌లో ఆడుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒత్తిడి ఒకవైపు, భారత్‌తో ఘర్షణ పడితే ప్రపంచ క్రికెట్‌లో మనుగడ కష్టమన్న భయం మరోవైపు పిసిబిని ఆత్మరక్షణలో పడేసింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న పాక్ సర్కారు పరువు నిలబెట్టుకోవడానికి చివరి వరకూ బెట్టుచేసి, ఆతర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటికే ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పాక్ క్రికెటర్లు సర్కారు నుంచి అనుమతి లభించిన మరుక్షణమే బయలుదేరి భారత్ చేరుకున్నారు. ఆదివారం ఉదయం నెట్స్‌కు హాజరయ్యారు.