జాతీయ వార్తలు

సహనశీలతే పరమావధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి నూతన సంవత్సర సందేశం
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: శాంతియుత సమాజ నిర్మాణంకోసం ప్రతి ఒక్కరూ సహనశీలతను పెంపొందించుకోవాలని కొత్త సంవత్సరం తొలిరోజునే ఇందుకు నాంది పలకాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందించిన సందేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి వృద్ధికి దోహదం చేసే విధంగా అంకితం కావాలని పిలపునిచ్చారు. శాంతి, సామరస్యం అత్యంత శక్తివంతంగా పనిచేసే సమీకృత సమాజం నిర్మాణమే అందరి ధ్యేయం కావాలని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయగలరన్న ఆశాభావాన్ని రాష్టప్రతి వ్యక్తం చేశారు. ఆధునిక భారతదేశ సంక్లిష్ట, వైవిధ్యాన్ని కాపాడే నాగరిక విలువలను మరింత శక్తివంతంగా పాదుగొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రణబ్ అన్నారు. అలాగే స్వచ్ఛమైన పచ్చదనంతో కూడిన భారతావని నిర్మాణం కోసం కూడా రాష్టప్రతి మాట్లాడారు. మనిషి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగానే నడచుకోవాలని ప్రణబ్ పిలుపునిచ్చారు. పర్యావరణ కాలుష్యానికి కారణమైన స్వచ్ఛ్భారత్ సాధించడానికి పునరంకితం కావాలన్నారు.