క్రీడాభూమి

నేమార్ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా చేతిలో గటాఫే చిత్తు
మాడ్రిడ్, మార్చి 13: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో బార్సిలోనా ఆధిక్యం కొనసాగుతున్నది. గటాఫేతో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 6-0 తేడాతో చిత్తుచేసి తనకు తిరుగులేదని నిరూపించింది. మ్యాచ్ ఎనిమిదో నిమిషంలోనే గటాఫే ఆటగాడు జువాన్ రోడ్రిగెజ్ ఓన్‌గోల్ చేసి, బార్సిలోనా ఖాతాను తెరిచాడు. 19వ నిమిషంలో మునీర్ ఎల్ హద్దాదీ గోల్ సాధించగా, 32వ నిమిషంలో, తిరిగి 51వ నిమిషంలో నేమార్ ద్వారా బార్సిలోనాకు గోల్స్ లభించాయి. స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 40వ నిమిషంలో, అర్దా ట్యూరన్ 57వ నిమిషంలో గోల్స్ సాధించారు. బార్సిలోనా విజృంభణకు ఏ రకంగానూ సమాధానం చెప్పలేకపోయిన గటాఫే ఆటగాళ్లు ప్రేక్షక పాత్ర పోషించారు. కాగా, మరో మ్యాచ్‌లో డిపోర్టివా లా కరూనాను 3-0 గోల్స్ తేడాతో ఓడించిన అట్లెటికో మాడ్రిడ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కొనసాగిస్తున్నది. ఈ జట్టుకు 67 పాయింట్లు ఉండగా, 75 పాయింట్లతో బార్సిలోనా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 60 పాయింట్లు సంపాదించిన రియల్ మాడ్రిడ్ మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో సెల్టా విగో 1-0 తేడాతో రియల్ సోసియాడెడ్‌ను ఓడించింది. రయో వలెకానో, ఎబార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి.