జాతీయ వార్తలు

నిర్భయ దోషులకు ఉరే సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిని ఖరారుచేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఉరికి బదులు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని నిందితులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మరణశిక్షే సరైందంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో ముఖేన్‌సింగ్, అక్షయ్‌ఠాకూర్, వినయ్‌శర్మ, పవన్‌గుప్తా నిందితులు. గతంలోనే ట్రయల్ కోర్టు, హైకోర్టు వీరికి ఉరిశిక్షను ఖరారుచేసింది. అయితే న్యాయం పేరుతో తమను ఉరితీయటం సరికాదంటూ రివ్యూపిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తూ నిందితులు క్షమించరాని నేరం చేశారని, ముఖేష్, పవన్, వినయ్‌లకు ఉరిశిక్షను విధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.