జాతీయ వార్తలు

నిర్భయ కేసులో దోషి వినయ్‌శర్మ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నిర్భయ కేసులో దోషిగా దిల్లీ తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ వినయ్‌శర్మ బుధవారం రాత్రి మాత్రలు మింగి, అనంతరం టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. జైలు సిబ్బంది హుటాహుటిన దీన్‌దయాళ్‌ ఆసుపత్రికి అతడిని తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీలో 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఘటనలో వినయ్‌ సహా ఆరుగురు వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఒకరు మైనర్‌. మినహా వీరంతా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నిర్భయ కేసులో మరో దోషి రామ్‌సింగ్‌ కూడా 2013లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు.