జాతీయ వార్తలు

నాది రాజీపడని తత్వం... అందుకే ప్రధాని పదవి దక్కలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: స్వతంత్రంగా వ్యవహరించే నాయకుడు ప్రధానమంత్రి వంటి ఉన్నత స్థాయి పదవిని చేపట్టకూడదని 1991లో సోనియాగాంధీ భావించారని, అందువల్లే ఆ పదవికోసం తనకన్నా పి.వి.నరసింహారావుకు ఆమె ప్రాధాన్యం ఇచ్చారని మాజీ కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. విదేశీ సంతతికి చెందిన వారు ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదంటూ ప్రకటించడం ద్వారా 1997లో సోనియాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించిన శరద్ పవార్ ఆ తరువాత కాలంలో ఆమెతో రాజకీయంగా కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ‘లైఫ్ ఆన్ మై టర్మ్స్- ఫ్రం ద గ్రాస్‌రూట్స్ అండ్ కారిడార్స్ ఆఫ్ పవర్’ శీర్షికతో తాను రచించిన పుస్తకంలో శరద్ పవార్ ఈ విషయం వెల్లడించారు. సోనియాగాంధీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్టప్రతి, ఉప రాష్టప్రతి సహా అనేక మంది రాజకీయ నాయకులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో గురువారం ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న పి.వి.నరసింహారావు తిరిగి ప్రధానమంత్రి పదవిని ఎలా చేపట్టగలిగారు తదితర ఆసక్తికరమైన ఆనాటి అంశాలను పవార్ ఈ పుస్తకంలో వెల్లడించారు. 1996-97 మధ్య కాలంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా పనిచేసిన తనను పార్టీ అధ్యక్షురాలి హోదాలో సోనియా గాంధీ నిర్లక్ష్యం చేశారని, చిన్న చూపు చూశారని అనేక దృష్టాంతాలతో పవార్ ఈ పుస్తకంలో వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పవార్ ఎన్‌సిపిని స్థాపించి, తరువాత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా సోనియా నేతృత్వంలోని యుపిఏ హయాంలో పదేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కనీసం ఎంపి కూడా కాని సోనియాను ఎకాఎకిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) నేతను చేయడం కోసమే 1990ల తొలి నాళ్లలో సిపిపి రాజ్యాంగాన్ని సవరించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. 10 జన్‌పథ్‌కు విధేయులుగా చెప్పుకునే కొంతమంది తనకన్నా పి.వి.నరసింహారావుకు ప్రధానమంత్రి పదవి అప్పగించడం మంచిదని ఆమెకు నచ్చజెప్పారని పవార్ వెల్లడించారు. గాంధీ కుటుంబం ఎవరినీ స్వతంత్రంగా వ్యవహరించనిచ్చేది కాదని ఆయన పేర్కొన్నారు.
దివంగత అర్జున్ సింగ్, ఎం.ఎల్.్ఫతేదార్, ఆర్.కె.్ధవన్, వి.జార్జ్ సోనియాకు నచ్చజెప్పిన వారిలో ఉన్నారని ఆయన తెలిపారు. యువకుడినయిన తనకన్నా వృద్ధుడు, అంతగా ఆరోగ్యం బాగాలేని పి.వి.నరసింహారావును ప్రధానిని చేయడమే క్షేమమని వారు సోనియాకు నచ్చజెప్పారని పవార్ తెలిపారు. యువకుడయిన పవార్‌కు ప్రధాని పదవి అప్పగిస్తే దీర్ఘకాలం పాటు ఆయన అధికార కేంద్రంగా కొనసాగుతారని, దీనివల్ల గాంధీ కుటుంబం ప్రయోజనాలు దెబ్బతింటాయని వారు సోనియాకు చెప్పారని పవార్ తన పుస్తకంలో వెల్లడించారు.