జాతీయ వార్తలు

బెదిరింపులకు లొంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: నాగ్‌పూర్ కేంద్రం గా పనిచేస్తున్న ఆరెస్సెస్ కనుసన్నల్లో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాల రాచేందుకు చేస్తో న్న ప్రయత్నాలను సాగనిచ్చేది లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ పేరిట శుక్రవారం జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు కాంగ్రెస్ మార్చ్ నిర్వహించింది. మార్చ్‌లో భాగంగా పార్లమెంటు వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన సోనియా, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ మరికొందరు పార్టీ నేతలను పోలీసులు నిలువరించారు. పార్లమెంటు వీధి పోలీసు స్టేషన్‌లో కొద్దిసేపు ఉంచి అనంతరం విడుదల విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎన్డీయే, ప్రధాని మోదీ, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ నేతలు వాగ్బాణాలు సంధించారు. ‘ఆరెస్సెస్, ఎన్డీయే అధినేతలకు ఈ వేదిక నుంచి స్పష్టంగా చెబుతున్నా. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు మీ జీవితకాలంలో నెరవేరనివ్వం’ అంటూ సోనియా విరుచుకుపడ్డారు. విపక్షాన్ని భయపెట్టేందుకు, అప్రతిష్టపాలు చేసేందుకు ఎంత ప్రయత్నించినా లొంగేది లేదన్నారు. ‘నా జీవితం పోరాడటం నేర్పింది. ఇప్పటికే ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. మీ సవాల్‌ను ఎదుర్కొంటా’ అంటూ సోనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత నుంచి కాంగ్రెస్‌ను తప్పించగలుగుతామని భావించేవారికి, కాంగ్రెస్ ఏ మట్టితో తయారైందో తెలియదని సోనియా ఎద్దేవా చేశారు. జాతి వ్యతిరేక శక్తులతో పోరాడటం తమకు కొత్తేమీ కాదంటూ, సోదరభావాన్ని దెబ్బతీస్తున్న వారిని ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెస్‌కు బాగా తెలుసన్నారు. మానవతా పునాది నియమాల రక్షణకు కాంగ్రెస్ రక్తం ధారపోస్తుంది, అవసరమైతే ప్రాణాలను అర్పిస్తుందని సోనియా ఆవేశంతో చెప్పారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ చేసిన కృషిని రెండేళ్లలో మోదీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. మోదీ సర్కారు ప్రతి అడుగూ ప్రజాస్వామ్య పునాదులను కుదిపేస్తోందన్నారు. మోదీ పాలనలో అన్ని వర్గాలూ ఇబ్బందులకు గు రవుతున్నాయన్నారు. దేశాన్ని ఎ న్నో సమస్యలు కుదిపేస్తున్నా మోదీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసే పని ప్రారంభించిందన్నారు. ధన, కండ బలాన్ని ప్రయోగించి ప్ర జాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అరుణాచల్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కూలదోశారని ఆరోపించారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయ టం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని సోనియా ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో బిజెపి ఆటవిక రాజ్యా న్ని నడిపిస్తోందన్నారు. మోదీ, ఆయ న సలహాదారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. పంచాయితీరాజ్ వ్య వస్థను పటిష్టం చేసేందుకు కాంగ్రె స్ ప్రభుత్వాలు చేసిన చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సవరణలతో నిర్వీ ర్యం చేస్తోందన్నారు. తద్వారా మహిళలు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారు పంచాయితీలకు పోటీ చేయకుండా నిరోధిస్తున్నారని సోని యా ఆరోపించారు. సమాజాన్ని మ తం, భాష, ఆహారపు అలవాట్లు, బట్ట లు వేసుకునే పద్ధతి ఆధారంగా విడదీసేందుకు కుట్ర చేస్తోందని సోని యా ఆరోపించారు. విద్యార్థులపై దౌర్జన్యం చేస్తున్నారు. కొందరిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తే మరికొందరిని కేసు ల్లో ఇరికిస్తున్నారని సోనియా ఆరోపించారు. అలాంటి మోదీ సర్కారును శిక్షించేందుకు దేశ ప్రజలు సిద్ధమవుతున్నారని సోనియా అన్నారు. ఎన్డీ యే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయి. తమ రెండేళ్ల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు విపక్షాల నేతలపై నిరాధార ఆరోపణలు చేసే ఆట ప్రారంభించిందన్నా రు. పుకార్లు పుట్టించటం ద్వారా ఇతరులను చరిత్రహీనులుగా చిత్రీకరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే తమ పూర్తి శక్తి యుక్తులను ఉపయోగిస్తోందని, కాంగ్రెస్ బలహీనపడిందని భావించే తప్పు చేయొద్దని సోనియా హెచ్చరించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తూనే, రానున్న దినాల్లో మరింత పట్టుదలతో ముందుకు సాగుతుందని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు దేశంలోని ప్రతి మూలకూ వెళ్లి మోదీ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని వివరించాలని సోనియా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు జరిగే ప్రతి ప్రయతాన్నీ వమ్ము చేయాలని ఆమె పార్టీ నేతలకు సూచించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మన్మోహన్‌లను నిరోధిస్తున్న మహిళా పోలీసులు, హాజరైన జనం..ఎ.కె.ఆంటోనీని తీసుకెళుతున్న పోలీసులు