జాతీయ వార్తలు

మళ్లీ సొంత గూటికి అమర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 17: సమాజ్‌వాది పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ మంగళవారం తిరిగి ఆ పార్టీలో చేరారు. అమర్ సింగ్ పార్టీలో చేరినట్లు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని బట్టి ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లు అర్థమవుతోంది. అయితే అమర్ సింగ్ పార్టీలో చేరడం సమాజ్‌వాది పార్టీలో ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశముంది. వచ్చేనెల జరగనున్న రాజ్యసభ ఎన్నికలకోసం సమాజ్‌వాది పార్టీ మంగళవారం ప్రకటించిన ఏడుగురు అభ్యర్థుల జాబితాలో అమర్ సింగ్ పేరు ఉంది. మిగతా ఆరుగురిలో ఇటీవలే కాంగ్రెస్‌నుంచి సమాజ్‌వాది పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, సంజయ్ సేథ్, సుఖ్‌రామ్ యాదవ్, విశ్వంభర్ ప్రసాద్ నిషాద్, అరవింద్ సింగ్, రేవతీ రమణ్ సింగ్‌లున్నారు. అమర్‌సింగ్‌ను పార్టీలోకి చేర్చుకోవాలన్న నిర్ణయం లక్నోలో జరిగిన సమాజ్‌వాది పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్, సీనియర్ మంత్రులు శివపాల్ యాదవ్, మహమ్మద్ ఆజమ్ ఖాన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
యుపి లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమర్ సింగ్ హాజరు కావడంతో ఆయన సమాజ్‌వాది పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన అమర్‌సింగ్‌ను 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీనుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టి యుపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రీయ లోక్‌దళ్‌లో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అమర్ సింగ్ ఇటీవలి కాలంలో సమాజ్‌వాది ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉండడం, ములాయం సింగ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ల నివాసాలకు తరచూ వెళ్తూ ఉండడంతో ఆయన మళ్లీ తన పాత పార్టీలో చేరుతారనే ఊహాగానాలు మొదలైనాయి.