జాతీయ వార్తలు

వీడియోలు నిజమైనవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ఫిబ్రవరి 9వ తేదీన ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకులు కన్హయ్యకుమార్ బృందం దేశ ద్రోహ నినాదాలు చేసిన మాట వాస్తవమేనని స్పష్టమైంది. పార్లమెంట్‌పై దాడి కేసులో నేరగాడు అఫ్జల్ గురును ఉరితీయటాన్ని వ్యతిరేకిస్తూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి, దేశానికి, జాతికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం నిజమేనని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన నాలుగు వీడియోలను పరీక్షించిన ల్యాబ్.. అవి తారుమారు చేసినవి కాదని.. నిజమైనవేనని తేల్చింది. 2013 ఫిబ్రవరి 9న తిహార్ జైల్లో అఫ్జల్ గురును ఉరితీసిన సందర్భాన్ని పురస్కరించుకుని, జే ఎన్‌యూలో వివాదాస్పద కార్యక్రమం ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు అఫ్జల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. ‘మీరు ఎంతమంది అఫ్జల్‌లను చంపుతారు.. ప్రతి ఇంటా ఓ అఫ్జల్ పుట్టుకొస్తాడు, పాకిస్తాన్ జిందాబాద్, కశ్మీర్‌కు స్వతంత్రం వచ్చే వరకు యుద్ధం కొనసాగుతుంది.. భారత్ వినాశనం జరిగే వరకు యుద్ధం సాగుతుంది. అఫ్జల్ హత్యను సహించేది లేదు.’ అన్న నినాదాలు చేసినట్లు నివేదికలో స్పష్టమైంది. కన్హయ్యకుమార్, అనిర్బన్, ఉమర్‌లపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురూ ప్రస్తుతం మధ్యంతర బెయిలుపై ఉన్నారు.