జాతీయ వార్తలు

హోదాపై మహానాడులో తీర్మానం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పని చేయాలని, మహానాడులో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచందర్‌రావు ఏపీ సీఎం చంద్రబాబుకు బుధవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు రాష్ట్రంలోని అధికార, విపక్షాలన్నీ కలిసి ఒక కార్యచరణను రూపొందించుకుని అమలు చేయవలసిన అవసరం ఉన్నదని కేవీపీ సూచించారు. ఈనెల 27నుంచి జరిగే మహానాడులో ‘తప్పనిసరైతే బిజెపితో పొత్తు కంటే ఏపికి ప్రత్యేక హోదా సాధనే ముఖ్యమనేలా మీరొక రాజకీయ తీర్మానాన్ని ఆమోదింపజేసి, రాష్ట్ర విభజన చట్టం, రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు సత్వరం అమలు చేయించుకోలేకపోతే వచ్చే కష్టనష్టాలను మీ శ్రేణులకు అర్థమయ్యేలా చేసి వారిని కర్తవ్యోన్ముఖులను చేయాలి’ అని కేవీపీ పేర్కొన్నారు. ‘నిర్దిష్ట గడువులో కేంద్రం మీద అవసరమైతే సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించేందుకు ఏ మాత్రం వెనుకాడకుండా మీ మ్యానిపులేషన్ చతురత, ఢిల్లీలో చక్రం తిప్పగల సమర్థతను మీ కోసం, మీ మనుషుల కోసమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం కూడా వాడగలరనే సందేశం పంపేలా తగు చర్యలు చేపట్టాల’ని ఆయన చంద్రబాబుకు విజప్తి చేశారు.
‘ప్రత్యేక హోదా విషయంలో మీరు పలుమార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు, వారు వ్యక్తిగతంగా మీకు ఏం చెబుతున్నారో తెలియదు కానీ హోదా ఇవ్వలేమనే విషయాన్ని కేంద్ర మంత్రులు, బి.జె.పి నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నార’న్నారు. అయినా బాబు, ఆయన పార్టీ నేతలు ఇప్పటికీ ప్రత్యేక హోదా సాధిస్తామనే చెబుతుండటం వల్ల ఈ విషయంలో ప్రజలు ఆయోమయానికి, ఆందోళనకు గురి అవుతున్నారని కేవీపీ చెప్పారు. రాజ్యసభలో తాను ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు వచ్చే లోగా ఏ.పికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఒక్క తాటిపైకి రావలసిన అనివార్య పరిస్థితి ఉందన్నారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి విభజన హామీల సాధన కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాలని కేవీపీ ప్రతిపాదించారు. విభజన చట్టం, రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు జరిగే వరకు రాష్ట్రంలోని అన్ని పక్షాలతో పరస్పర దూషణ విరమణ ఒప్పందం చేసుకోవాలని కేవీపీ ఏపీ సీఎంకు సలహా ఇచ్చారు.