జాతీయ వార్తలు

బాబు ఒప్పుకుంటేనే హైదరాబాద్‌లో ప్రత్యేక కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 25: ఉమ్మడి న్యాయస్థానం విభజన బంతిని కేంద్రం ఆంధ్రప్రదేశ్ కోర్టులో వేసింది. హైదరాబాద్‌లో ఏపీకి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముందుకొచ్చినా, అందుకు ఏపి ముఖ్యమంత్రి అంగీకరించాలే తప్ప కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రెండేళ్ల నరేంద్ర మోదీ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను మంత్రి బుధవారం ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో వివరించారు. ఎపి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని, దానికోసం ఎపి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సివుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పును బట్టి ముందుకు వెళ్తామని చెప్పారు.

‘స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్‌ను చేర్చాలి’
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మే 25: తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పట్టణాన్ని ఆకర్షణీయ నగరాలు (స్మార్ట్ సిటీ) జాబితాలో చేర్చాలని ఎంపీ వినోద్ కుమార్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నేతల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కరీంనగర్‌ను జాబితాలో చేర్చేందుకు విధివిధానాల్లో చిన్న మార్పులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత కరీంనగర్ ముఖ్యమైన నగరం అని అభివృద్ధికి అన్ని అవకాశాలు వున్నాయని తెలిపారు. కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మేయర్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. జాబితాలో చోటు కోసం ఎటువంటి సంస్కరణలు తీసుకురావడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కరీంనగర్ మేయర్ సైతం తెలియజేశారని వెంకయ్య తెలిపారు. చారిత్రాత్మక నగరం వరంగల్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా కేంద్రం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్మార్‌సిటీగా ఎంపిక అయితే కేంద్రం నుండి ఆ పట్టణానికి నిధులు కేటాయిస్తుంది.