జాతీయ వార్తలు

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: భూమిపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత వాయుసేన శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో గల పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు సమాచారం. ఈ క్షిపణి నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదించిందని అధికారులు ధ్రువీకరించారు. ప్రపంచంలోనే వేగవంతమైన యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. భారత్, రష్యాలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. షార్ట్ రేంజ్ మిసైల్ అయిన బ్రహ్మోస్‌ను జలాంతర్గాములు, ఓడలు, విమానాలతోపాటు భూమి మీదినుంచి కూడా ప్రయోగించవచ్చు. 290 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలుగుతుంది. ల్యాండ్ అటాక్ వెర్షన్ బ్రహ్మోస్‌ను మొబైల్ అటానమస్ లాంచర్‌పై బిగించి ప్రయోగించారు. గత కొనే్నళ్లలో ఈ మొబైల్ ల్యాండ్ ఆధారిత క్షిపణి కాన్ఫిగరేషన్ అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 రూపాల్లో ముందుకొచ్చింది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని సముద్రంలో 40 నుంచి 50 మీటర్ల లోతులో ఉన్న జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇదిలా ఉండగా, బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్‌డ్ వెర్షన్ కూడా త్వరలో ప్రయోగానికి సిద్ధమయింది. ఐఎఎఫ్‌కు చెందిన ఎస్‌యు-30ఎంకెఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించనున్నారు.

చిత్రం... బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని
ప్రయోగించేందుకు తీసుకెళుతున్న భారత వాయుసేన