జాతీయ వార్తలు

8 రాష్ట్రాల్లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మరోసారి దేశంలోని పలు రాష్ట్రాలపై ఉగ్రవాదులు పంజా విసిరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అనేక కోణాల నుంచి సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా ఇంటిలిజెన్స్ సంస్థలు ఈమేరకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ సహా మొత్తం 8 రాష్ట్రాలపై ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్త అలెర్ట్ ప్రకటించాయి. కీలక రాష్ట్రాలపైనే కాకుండా దేశంలో మతకల్లోలం సృష్టించే లక్ష్యంతో ప్రార్థనా స్థలాలపై కూడా ఉగ్రవాద మూకలు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించాయి. పర్యాటకంగా కూడా ఇప్పుడిప్పుడే బలపడుతున్న భారత్‌లో ఆ అవకాశాలు దెబ్బతీయాలన్న వ్యూహం కూడా ఉగ్రవాదుల దాడుల యోచన వెనకు ఉందని, ఇందులో భాగంగా మత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలపైనా, టూరిస్ట్ కేంద్రాలపైన కూడా వీరు విరుచుకుపడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. జైపూర్, అజ్మీర్, జోధ్‌పూర్, సిఖార్ వంటి టూరిస్ట్ స్థావరాలపై ఈ ముష్కర మూకలు గురిపెట్టినట్టుగా తమకు కీలక సమాచారం అందినట్టు ఇంటిలిజెన్స్ బ్యూరో వర్గాలు తెలిపాయి. ముందస్తుగానే అన్ని జన సమ్మర్థ ప్రాంతాల్లోనూ, ప్రార్థనా స్థలాల్లోనూ, టూరిస్ట్ కేంద్రాల్లో కూడా గరిష్టస్థాయిలో అప్రమత్తతను ప్రకటించినట్టు తెలిపాయి. భారత పార్లమెంట్‌పై ఉగ్రవాద మూకలు తెగబడి 14 సంవత్సరాలు పూరె్తైన సందర్భంలో అమరవీరులకు యావజ్జాతి ఘన నివాళి అర్పించిన తరుణంలోనే ఉగ్రవాదుల తాజా దాడులకు సంబంధించిన సమాచారం వెల్లడికావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ ఎనిమిది రాష్ట్రాలపైనే తీవ్రవాదులు తెగబడే అవకాశం ఉందన్న రూఢీ సమాచారం ప్రాతిపదికగా అన్ని రకాలుగానూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు వెల్లడించాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు సహా అన్నిచోట్లా ఇప్పటికే భద్రతా దళాలను అప్రమత్తం చేయాలని ఈ ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసినట్టు వెల్లడించాయి. ఎప్పుడైతే ఇంటిలిజెన్స్ సమాచారం అందిందో, ఈ ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలు భద్రత, నిఘాకు సంబంధించిన ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇటీవల ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఐవొసికి చెందిన ఓ సీనియర్ అధికారి అరెస్ట్ కావడం, అంతకుముందు పాకిస్తాన్ ఐఎస్‌ఐతో లింకులున్నాయన్న ఆరోపణలపై ఒక కానిస్టేబుల్ అరెస్ట్ కావడం తాజాగా ఐబి చేసిన హెచ్చరికల ప్రాధాన్యతను పెంచుతోంది. ఓపక్క ఉగ్రవాదులు, మరోపక్క ఐఎస్‌ఐఎస్ తీవ్రవాద సంస్థ భారత్‌నే లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేనివిధంగా గరిష్టస్థాయిలో అప్రమత్తత పాటించటం ద్వారా ఉగ్రవాద ముప్పును మొగ్గలోనే తుంచేయాలన్న లక్ష్యంతో నిఘా వర్గాలు పని చేస్తున్నాయి. ఐబి హెచ్చరికల నేపథ్యంలో ఈ ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టమవుతోంది.

చిత్రం.. పార్లమెంట్‌పై దాడి జరిగి 14ఏళ్లు పూరె్తైన సందర్భంలో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.