జాతీయ వార్తలు

త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని త్వరలోనే పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సంకేత ప్రాయంగా తెలిపారు. ఇందులో భాగంగా పనిచేయని మంత్రులపై వేటువేసి..కొత్తవారిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా ‘త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరుగుతాయి. కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదు’అని వెల్లడించారు. గత కొన్ని వారాలుగా మోదీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో అమిత్ షా చేసిన ప్రకటనకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సంకేతాలను బట్టి జూన్ మొదటివారంలోనే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడం, అసోంలో తొలి సారిగా బిజెపి విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో క్రీడాశాఖ సహా మంత్రి పదవికి (స్వతంత్య్ర నిర్వహణ) కొత్త మంత్రిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల మాట ఎలా ఉన్నా అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ పదవుల్లో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు.