జాతీయ వార్తలు

శంకర్ విగ్రహావిష్కరణకు ఊమన్ చాందీ హాజరుకారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కేరళలోని కొళ్లంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరువుతున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాకూడదని కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీని కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నరేంద్ర మోదీ కొళ్లం వెళుతున్నారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేషన్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఊమన్ చాందీ మొదట నరేంద్ర మోదీని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారని సుర్జేవాల్ వివరించారు. అయితే మోదీ ఇప్పుడు ముఖ్యమంత్రి విజ్ఞప్తిని పక్కనబెట్టి ఇతరుల విజ్ఞప్తి మేరకు కొళ్లం వెళుతున్నారని ఆయన చెప్పారు. మోదీ ఈ నిర్ణయం ద్వారా ముఖ్యమంత్రిని అవమానపరిచారు, అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని ఊమన్ చాందీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షానికి చెందిన ముఖ్యమంత్రులు, నాయకులను అవమానించటం బిజెపికి ఒక అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రధాన మంత్రి చెప్పుకునే సహకార ఫెడరలిజానికి ఇది పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అవమానించటం బిజెపికి ఒక అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
గతంలో సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్ర్తీని స్వంతం చేసుకునేందుకు ప్రయత్నించిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు కేరళలో ఆర్.శంకర్‌ను తమ స్వంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సుర్జేవాల్ ఆరోపించారు.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఆగడాలను కేరళ ప్రజలు ఎంతమాత్రం సహించరు, అందుకే నరేంద్ర మోదీ శివగిరి మఠానికి అతిథిగా కాకుండా సందర్శకుడుగా వచ్చేందుకు మాత్రమే మఠం సన్యాసులు అంగీకరించారని ఆయన చెప్పారు. కేరళ శాసనసభ ఎన్నికలను మతతత్వం చేసేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించిందని సుర్జేవాల్ ఆరోపించారు.