జాతీయ వార్తలు

దేశానికే గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: ప్రధాని నరేంద్ర మోదీకి అఫ్గానిస్తాన్ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం భారత్‌కు గర్వకారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని మోదీకే కాకుండా యావత్ దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్న జైట్లీ భారత్ తరఫున అఫ్గాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా శనివారం ఆఫ్గానిస్తాన్‌ను సందర్శించిన ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన అమీర్ అమానుల్లాఖాన్ అవార్డును బహూకరించిన విషయం విదితమే. రూ.1700 కోట్ల వ్యయంతో అఫ్గాన్‌లో భారత్ నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని బహూకరించారు. అఫ్గాన్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న భారత తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, అతున్నత పౌర పురస్కారాన్ని తనకు బహూకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అఫ్గానిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు అమానుల్లా ఖాన్ పేరిట జాతీయ అవార్డును నెలకొల్పింది. 1919-1929 మధ్యకాలంలో ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌ను అమానుల్లాఖాన్ పాలించాడు. ప్రధాని మోదీ ఖతర్ పర్యటనపై అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, గల్ఫ్ దేశాలనుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్ల వ్యవధిలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తికూడా పెరిగిందని జైట్లీ తెలిపారు.’

అజిత్ వ్యూహంపై
ఆచితూచి అడుగు

నేటి సమావేశంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి
అనంతరమే తదుపరి నిర్ణయం

న్యూఢిల్లీ, జూన్ 5: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షునిగా నియమిస్తే రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతానంటూ చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి చేసిన హెచ్చరికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆచి తూచి అడుగు వేయబోతోంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి సోమవారంనాడు అజిత్ జోగి తన సొంత ఊరైన మార్వాహిలో జరిపే సమావేశం ఏవిధంగా సాగుతుందన్న దానిమీదే కాంగ్రెస్ అధినాయకత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రేపటి సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, కొత్త పార్టీని ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలను అజిత్ జోగి ప్రకటించవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన అజిత్ జోగి దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకుడని, ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం ఏ విధంగా జరుగుతుందన్న దానిపైనే ఆయనపై తమ తదుపరి చర్య ఆధారపడి వుంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బి.కె. హరిప్రసాద్ స్పష్టం చేశారు. అజిత్ జోగితో మంతనాలు జరపడానికి ఇంతవరకు అధినాయకత్వం ఎవరినీ పంపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. చతీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విభాగం ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు అనుబంధంగా వ్యవహరిస్తోందని ఇటీవల ఆరోపించిన అజిత్ జోగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగానూ భవిష్యత్తు లేదని కూడా వెల్లడించారు. ప్రస్తుత స్థితిలో రమణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కొత్త పార్టీ పెట్టడం ఒక్కటే మార్గమని కూడా జోగి చెప్పారు. అజిత్ తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతోందన్న అంశంపైనే సర్వత్రా ఉత్కంఠ కొనకొంది. అలాగే కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆయనను బుజ్జగిస్తుందా లేక అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాత్మకంగానే వ్యవహరిస్తుందా అన్నది ఆసక్తి కలిగిస్తోంది.