జాతీయ వార్తలు

కోర్టు వెలుపలా పరిష్కరించుకోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను తగ్గించేందుకు న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకోవాలన్న ప్రభుత్వం ప్రతిపాదనకు లీగల్ రిఫామ్స్ ప్యానెల్ మద్దతు తెలుపుతోంది. నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరి, న్యాయ సంస్కరణల కమిటీ ఎదుట కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. మధ్యవర్తులద్వారా పరిష్కారమయ్యే కేసులకు చట్టబద్ధత ఉండాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు పలికింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశానికి హాజరైన అనేకమంది ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు మధ్యవర్తిత్వం నెరపడానికి చొరవ తీసుకోవాలని పలువురు సలహా ఇచ్చారు’ అని స్పష్టం చేశారు. న్యాయశాఖ మంత్రి అధ్యక్షతన రెండేళ్లకోసారి సంస్కరణ కమిటీ సమావేశమవుతుంది. సుప్రీం కోర్టు ప్రతినిధులు, బార్ కౌన్సిల్, కేంద్ర హోమ్, న్యాయమంత్రిత్వశాఖ, అటార్నీ జనరల్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం వైవాహిక సంబంధమైన కేసులే మధ్యవర్తుల ద్వారా పరిష్కారమవుతున్నాయి.
కోర్టు బయట కేసులు పరిష్కరించుకునేందుకు వీలుగా చట్టం తీసుకొచ్చి భూస్వామి-కౌలురైతు, పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఓ నోట్‌ను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.