జాతీయ వార్తలు

లేఖ రాయడం రాజకీయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాసి రాజకీయం చేయటం మంచిది కాదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి ఆరోపించారు. వేణుగోపాలచారి మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాకముందే నీటి పంపిణీ బాధ్యతను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని చంద్రబాబు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివని చెప్పిన చంద్రబాబు ఇప్పుడిలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించిన ప్రతి అంశంపై ఏ.పి.తో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వేణుగోపాలచారి తెలిపారు. జల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు చంద్రబాబు ముందుకు రావాలని సూచించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలుచేయటమే బోర్డు బాధ్యత తప్ప రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలను కేటాయించే అధికారం లేదనేది చంద్రబాబుకు తెలియదా? అని వేణుగోపాలచారి ప్రశ్నించారు. నదీజలాల విషయంలో బోర్డుదే తుది నిర్ణయమని బాబు చెప్పటం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. చంద్రబాబు తమ లేఖలో పేర్కొన్నవన్నీ అవాస్తవాలని చెప్పారు. చంద్రబాబు తప్పుడు సమాచారం ద్వారా ఏ.పి. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణకు రావలసిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు వేణుగోపాలచారి చెప్పారు. ఎఫ్‌ఆర్‌బిఎం గురించి కూడా జైట్లీకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.