జాతీయ వార్తలు

మితిమీరిన విమర్శలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 10: బాలీవుడ్ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’ లో కొన్ని సన్నివేశాలు ‘చాలా అసభ్యకరం’గా ఉన్నాయని కేంద్ర సెన్సార్ బోర్డు (సిబిఎఫ్‌సి) సోమవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. ఈ చిత్రంలోని ‘జమీన్ బంజర్ తో ఔలాద్ కంజర్’ అనే డైలాగ్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ, ఇటువంటి అసభ్యకరమైన డైలాగ్‌లను, అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి తీరాల్సిందేనని హైకోర్టుకు సెన్సార్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను తొలగించాలని సిబిఎఫ్‌సి రివైజింగ్ కమిటీ జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ‘ఉడ్తా పంజా బ్’ సినీ నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిలిమ్స్ పిటిషన్ దాఖలు చేయడంతో సిబిఎఫ్‌సి తరఫున అద్వైత్ సెథ్నా సోమవారం హైకోర్టులో వాదన వినిపించారు.
దీనిపై జస్టిస్ ఎస్‌సి.్ధర్మాధికారి, జస్టిస్ షాలినీ పన్సాల్కర్ జోషిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, నవతరం ప్రేక్షకులు ఎంతో పరిణితి చెందిన వారని, కనుక ఇటువంటి అంశాలు వారిని మెప్పించలేవని పేర్కొంది. సినిమాలో గానీ టెలివిజన్‌లో గానీ ఏది కావాలనుకుంటే దానిని చూసే స్వేచ్ఛను ప్రజలకు కల్పించాలని సెన్సార్ బోర్డుకు స్పష్టం చేసింది.

‘ఉడ్తా పంజాబ్’ వ్యవహారంలో
సెన్సార్ బోర్డుకు హైకోర్టు హితవు

ముంబయి, జూన్ 10: చిత్ర పరిశ్రమలో సృజనాత్మకతను దెబ్బతీసే విధంగా మితిమీరిన విమర్శలు చేయవద్దని బాంబే హైకోర్టు శుక్రవారం సిబిఎఫ్‌సి (కేంద్ర సెన్సార్ బోర్డు)కి స్పష్టం చేసింది. అలాగే ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంలో అభ్యంతరకరమైన, అశ్లీల సన్నివేశాలను తొలగించాలని ఆ సినిమా నిర్మాతలకు సూచించింది. ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంలో మార్పులు చేయాలన్న సిబిఎఫ్‌సి రివైజింగ్ కమిటీ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ ఆ సినిమా నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిలిమ్స్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ ఎస్‌సి.్ధర్మాధికారి, జస్టిస్ షాలినీ పన్సాల్కర్ జోషిలతో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం సోమవారం ఇరుపక్షాల వాదనలను విని విచారణ పూర్తి చేసింది. అయితే ఈ అంశంపై ఈ నెల 13వ తేదీన తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది. ఈ చిత్రంలో పంజాబ్‌కు సంబంధించిన ప్రస్తావనలన్నింటినీ తొలగించాలని పేర్కొంటూ ‘ఉడ్తా పంజాబ్’ చిత్ర నిర్మాతలకు సెన్సార్ బోర్డు ఆదేశాలను జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీని వలన ఈ చిత్ర మూలం దెబ్బతింటుందని, కనుక కావాలనుకున్న దానిని చూసేలా ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలని బాంబే హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.