జాతీయ వార్తలు

రాజ్యసభలో పేరుకుపోతున్న బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: రాజ్యసభలో మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులుసహా ఇప్పటికీ 45 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మే నెలలో లోక్‌సభ సమావేశాలు ముగిసేనాటికి ఐదు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులో రాజ్యాంగం 120 రెండో సవరణ బిల్లు ఉంది. అదే జిఎస్‌టి బిల్లు. లోక్‌సభ ఆమోదం తెలిపిన తరువాత గత ఏడాది ఆగస్టులో ఎగువసభ ముందుకు బిల్లు వచ్చింది.
అలాగే మరో కీలక బిల్లు విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ బిల్లు-2015 కూడా గత డిసెంబర్‌లో సభలో ప్రవేశపెట్టినా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో అదీకాస్తా పెండింగ్‌లో పడిపోయింది. పార్లమెంటు బడ్జెట్, శీతాకాల సమావేశంల్లోనూ దీని ఊసేలేకుండా పోయింది. లోక్‌సభలోనూ ప్రాధాన్యత బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్లు-2015, బినామా ట్రాన్సాక్షన్ (ప్రొహిబిషన్) సవరణ బిల్లు-2015 పెండింగ్ జాబితాలో ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టి బిల్లుకు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోక్షం లభిస్తుందన్న ధీమాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదానికి సభలో మద్దతు కూడగడుతున్నట్టు సోమవారం ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. గత పార్లమెంటు సమావేశాల్లో బిల్లుకు ఆమోదం పొందడానికి ప్రభుత్వం విఫలయత్నమే చేసింది. ఎన్‌డియే రెండేళ్ల పాలనలోనూ జిఎస్‌టి బిల్లుకు మోక్షం లభించలేదు. దశాబ్దాలుగా అనేక బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు-1987, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ బిల్లు-1990, రాజ్యాగం 79వ సవరణ బిల్లు-1992 ఆమోదానికి నోచుకోలేదు. మెడికల్ కౌన్సిల్ బిల్లుపై సంయుక్త కమిటీ 1989లోనే నివేదికను పంపింది. అలాగే వర్కర్స్ మేనేజ్‌మెంట్ బిల్లుకు సంబంధించి కార్మిక, సంక్షేమ వ్యవహారాలు చూసే పార్లమెంటు స్థాయి సంఘం 2001 డిసెంబర్‌లో నివేదిక అందజేసింది. దీనికి 11ఏళ్ల సయమం పట్టింది. అలాగే పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లుల్లో వక్ఫ్ ప్రొటక్షన్-2014, భూ సేకరణకు సంబంధించి పునరావాసం, రీసెటిల్‌మెంట్ (సవరణ)-2015, ఎనిమీ ప్రాపర్టీ (సవరణ)-2016 ఉన్నాయి. ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీల (క్రమబద్ధం) బిల్లు-2007 రాజ్యసభలో పెడింగ్‌లో ఉంది.