జాతీయ వార్తలు

అన్ని సైనిక విభాగాల్లో మహిళల సంఖ్య పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: రాబోయే రోజుల్లో అన్ని సైనిక విభాగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచుతామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం తెలిపారు. ‘‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నెమ్మదిగా మహిళా సైనికుల భాగస్వామ్యాన్ని పెంచుతాము’ అని ఆయన తెలిపారు. ఎన్‌సిసి విభాగానికి చెందిన మహిళలు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పారికర్ మాట్లాడారు. ముగ్గురు మహిళా ఫ్లైయింగ్ క్యాడెట్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ఈ ముగురినీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ దళంలో చేర్చుకోనున్నట్లు పారికర్ తెలిపారు. కర్ణాటకలోని బీదర్‌లో హాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై ఏడాదిపాటు వీరికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ నెలలోనే వాళ్లు బీదర్ వెళ్తారని, 2017 జూన్ నాటికి ఫైటర్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించేలా శిక్షణ ఇస్తామని పారికర్ వెల్లడించారు. ప్రస్తుతానికి కేవలం ముగ్గురు మాత్రమే ఫైటర్ పైలట్ శిక్షణకి ఎంపికయ్యారు.
ఎన్‌సిసి ప్రధానంగా బాలికలను ఎక్కువగా ప్రోత్సహించాలని పారికర్ సూచించారు.

chitram..
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఎన్‌సిసి కేడెట్లను అభినందిస్తున్న పారికర్

ఆసియా టాప్ 50లో
నాలుగు ఐఐటిలు

ఆంధ్ర యూనివర్సిటీకి 300 పైన ర్యాంకు
న్యూఢిల్లీ, జూన్ 14: బెంగళూరులోని భారత విజ్ఞాన శాస్త్ర సంస్థ (ఐఐఎస్‌సి)తోపాటు ముంబై, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్ ఐఐటిలకు ఆసియాలో అత్యుత్తమ 50 యూనివర్సిటీల్లో స్థానం దక్కింది.
క్యూఎస్ 2016 యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐఎస్‌సి ఈ సంవత్సరం 34వ ర్యాంకులో నిలిచింది. ఐఐటి ముంబై (35), ఐఐటి ఢిల్లీ (36), ఐఐటి మద్రాస్ (43), ఐఐటి కాన్పూర్ (48)వ ర్యాంకులను సాధించాయి. కాగా ఐఐటి ఖరగ్‌పూర్‌కు 51వ స్థానం లభించగా రూర్కీ ఐఐటి 78, గౌహతి ఐఐటి 94 ర్యాంకును సాధించాయి. నిరుడు 91వ స్థానంలో నిలిచిన ఢిల్లీ యూనివర్సిటీ ఈ సంవత్సరం పలు ర్యాంకులు ఎగబాకి ఏకంగా 66 స్థానానికి చేరుకుంది. కాగా కలకత్తా యూనివర్సిటీ 108వ ర్యాంకు (నిరుడు 149), ముంబై యూనివర్సిటీ 145, బనారస్ హిందూ యూనివర్సిటీ 155, పంజాబ్ యూనివర్సిటీ 251వ స్థానంలో నిలిచాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆసియాలో నెంబర్ వన్ వర్సిటీగా నిలిచింది. హాంకాంగ్ యూనివర్సిటీకి రెండోస్థానం లభించింది. భారత్‌కు సంబంధించినంత వరకు మొత్తం 23 యూనివర్సిటీలు తొలి 350 వర్సిటీల జాబితాలో నిలిచాయి. వీటిలో విశాఖపట్నానికి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ 301-350 ర్యాంకుల మధ్య చోటు సంపాదించుకుంది.