జాతీయ వార్తలు

రాష్ట్రాలకూ బాధ్యత ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రాష్ట్రాలకూ బాధ్యత ఉందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల ధరలు పెరుగుదల నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చెలరేగడంతో ‘్ధరల నియంత్రణ బాధ్యత మాకే కాదు, మీకూ ఉంది’ అని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాల ధరలు కిలోకు రూ.170కి పైగా పెరిగిపోయాయి. వరుసగా రెండేళ్లనుంచి కరవు కాటక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డిమాండ్, సరఫరాల మధ్య తీవ్రస్థాయిలో వ్యత్యాసం ఏర్పడింది.
బుధవారం ఢిల్లీలో కందిపప్పు, మినపప్పులను సబ్సిడీతో రూ.120కే మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయించిన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా పాశ్వాన్ మాట్లాడారు. ఎంతగా చర్యలు తీసుకున్నా, నియంత్ర వ్యవస్థను కట్టుదిట్టం చేసినా ధరలు పెరుగుతున్నాయంటే అందుకు కేంద్రానిదే బాధ్యత కాదు, సమాక్య వ్యవస్థలో ధరలను అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్రాలకూ ఉంటుందని ఉద్ఘాటించారు. జిఎస్‌టి బిల్లు ఆమోదం, జాతీయ స్థాయిలో ఉమ్మడి వ్యవసాయ మార్కెట్ల ఏర్పాటు వంటివి ఈ ధరలను చాలావరకు అరికట్టగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి కేంద్రం తీవ్రంగానే ప్రయత్నిస్తోందని, ఇప్పటికే బఫర్‌స్టాక్‌ను ఏర్పాటుచేశామని, అలాగే రిటైల్ పంపిణీకి సంబంధించి తమ అవసరాల జాబితాను ఇవ్వాలని కూడా ఇప్పటికే రాష్ట్రాలను కోరినట్లు తెలిపారు. కాని ఇంతవరకు చాలా రాష్ట్రాలు పప్పు్ధన్యాల అవసరాలకు సంబంధించి ఎలాంటి నివేదిక అందజేయలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్టల్రు ఈ బఫర్‌స్టాక్ నుంచి కొంతమేర పప్పు ధాన్యాలను తీసుకున్నాయని వెల్లడించారు. అదిక ధరలకు కేంద్రాన్ని నిందించడం సమంజసం కాదని, ముఖ్యంగా ఈ విషయంలో రాష్ట్రాలకు అధికారాలు ఉన్నప్పుడు కేంద్రంపైన నిందలు వేయడం ఎంతమేరకు సహేతుకమని ప్రశ్నించారు. అక్రమ నిల్వలను అరికట్టాలని రాష్ట్రాలకు కేవలం ఆదేశాలు మాత్రమే ఇవ్వగలుగుతామని, ఇందుకు సంబంధించిన అధికారం రాష్ట్రాలదే కాబట్టి అంతకుమించి కేంద్రం ముందుకు వెళ్లే అవకాశమే లేదని పాశ్వాన్ తెలిపారు. ఆపద సమయాన్ని సరఫరా చేయడానికి వీలుగా పప్పు్ధన్యాల మిగులు నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలను కోరడమే కాకుండా, అవసరమైతే వాటిని దిగుమతి చేసుకునే అవకాశం కూడా ఇచ్చామని అన్నారు.
chitram..
ఢిల్లీలో బుధవారం చౌక ధరలకు పపు పలను అందించే పథకాన్ని
ప్రారంభిస్తున్న కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్

రాము ఫేమ్..
త్రిలోక్‌చందర్ కన్నుమూత

చెన్నై, జూన్ 15: నాదీ ఆడజనే్మ, రాము, అవేకళ్లు, రాము, భద్రకాళి వంటి తెలుగు సినిమాలతోపాటు ఎన్నో తమిళ చిత్రాలకూ దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన నాటి దర్శకుడు ఎసి త్రిలోక్‌చందర్ కన్నుమూశారు. 85 సంత్సరాల త్రిలోక్‌చందర్ వయసు సంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలోనే బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలుగులో పలు విజయవంతమైన సినిమాలను అందించిన ఆయన తమిళంలో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించారు. హిందీలో కూడా ‘మైభీ లడ్‌కీహూ’, ‘దో దిలోంకి దస్తాన్’, ‘తేరీకసమ్’, ‘బాబు’ వంటి హిట్ చిత్రాలను అందించారు. వ్యాసరచయితగా, సినీస్టూడియోల్లో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన చందర్ 1962లో ఎవిఎం ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ‘వీర తిరుమగన్’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ‘అనే్బ వా’ (1966), రాము (1966), ‘అథె కంగళ్’ (1967), ‘నానుమ్ ఒరుపెన్’ (1963), ‘ఎంగమామఖ’ (1970), ‘్భరత విలాస్’ (1973) వంటి హిట్స్ అందించిన ఆయన అలనాటి మేటి నటులు ఎం.జి.రామచంద్రన్, శివాజీగణేశన్‌తో కలసి పనిచేశారు. 1986లో శివాజీతో రూపొందించిన ‘అన్బుల్లా అప్పా’ ఆయన చివరి సినిమా. 1969లో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘దేవమగన్’ చిత్రాన్ని ఆస్కార్ అవార్డుకోసం విదేశీభాషా చిత్రాల విభాగంలో మనదేశం తరపున పోటీకి పంపారు. తమిళనాడు ప్రభుత్వం అందించే ‘కళైమామమణి’ పురస్కారంతోపాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. చందర్ మృతిపట్ల తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం చెన్నైలో అంత్యక్రియలు జరుగుతాయి.