జాతీయ వార్తలు

ఎగిరిన తొలి స్వదేశీ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 17: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ రూపొందించిన శిక్షణ విమానం శుక్రవారం తొలిసారిగా టేకాఫ్ అయింది. రెండు సీట్ల సామర్థ్యం కలిగిన ఈ శిక్షణ విమానం ప్రారంభోత్సవానికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హాజరయ్యారు. హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన తొలి టేకాఫ్‌లో గ్రూప్ కెప్టెన్లు సి.సుబ్రమణియం, వేణుగోపాల్ పాల్గొన్నారు. త్రివిధ దళాల పైలట్లకు తొలి దశ శిక్షణ నిమిత్తం హెచ్‌టిటి-40ని రూపొందించారు.

అన్ని రుగ్మతలకు కారణం రాజకీయాలే
విసిల నియామకాల్లో
రాజకీయ జోక్యం వద్దు
విద్యారంగంలో నాసిరకం
ఫలితాలపై కమిటీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూన్ 17: విద్యారంగంలో నాసిరకం ఫలితాలకు ‘రాజకీయ జోక్యమే’ అత్యంత ప్రధాన కారణమని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నియమించిన ఒక కమిటీ అభిప్రాయ పడుతూ, యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ల నియామకాలు రాజీయాలకు తావులేని విధంగా చేయాలని సలహా ఇచ్చింది. విద్యాసంస్థల లొకేషన్ ఎంపిక మొదలుకొని గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరుకు ఆమోదం తెలపడం, పరీక్ష కేంద్రాల ఎంపిక, చాలా రాష్ట్రాల్లో వైస్‌చాన్సలర్లు మొదలుకొని కాలేజి ప్రిన్సిపాల్స్, జిల్లా విద్యాధికారుల నియామకాల దాకా అన్ని ఉన్నత పదవుల్లో నియామకాల వరకు అన్ని స్థాయిలలోను రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ కేబినెట్ కార్యదర్శి టిఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.
నియామకాలు, బదిలీలు, అఫిలియేషన్ మంజూరు, గుర్తింపు మంజూరు, చివరికి పరీక్ష ఫలితాలను తారుమారు చేసే దాకా కూడా అన్ని స్థాయిలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనేది కాదనలేని సత్యమని కొత్త విద్యా విధానం రూపకల్పనకు సిఫార్సులు చేయడం కోసం నియమించిన ఈ కమిటీ స్పష్టం చేసింది. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ విద్యాసంస్థల సమావేశాల్లోను, అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్రాల అధికారులతో అనధికారికంగా జరిపిన సమావేశాలు, సంభాషణల్లోను అందరూ చెప్పిన ఒకే ఒక కారణం రాజకీయ జోక్యమని కమిటీ పేర్కొంది. అర్హత కలిగిన విద్యాసంస్థలు గుర్తింపు కోసం దీర్ఘకాలంగా వేచి ఉంటుండగా, అర్హత లేని విద్యాసంస్థలు శరవేగంగా ఎందుకు గుర్తింపు లభిస్తోందని జాతీయ గుర్తింపు ఏజన్సీలను ప్రశ్నించినప్పుడు వారు చెప్పిన సమాధానం కూడా రాజకీయ జోక్యం వైపే వేలెత్తి చూపిస్తోందని కమిటీ ఆ నివేదికలో పేర్కొంది.