జాతీయ వార్తలు

మీరు తొండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: తెలంగాణ తొండివాదం వల్లే కృష్ణా జలాల వినియోగంపై అవగాహన కుదరటం లేదని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జల వివాదం పరిష్కారానికి కేంద్రం వెంటనే అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల మంత్రులు చర్చలు జరిపిన అనంతరం ఉమ మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. హరీశ్‌రావుతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. నాగార్జునసాగర్‌ను మాత్రమే కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని ఆంధ్ర డిమాండ్ చేస్తున్నట్టు హరీశ్ చెప్తున్నదంతా అబద్ధపు ప్రచారమన్నారు. టి.మంత్రి మాటలు దుర్మార్గమన్నారు. కృష్ణాపై రెండు రాష్ట్రాల్లో నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ బోర్డు పరిధిలోకి తేవాలని ఆంధ్ర కోరుతున్నట్టు చెప్పారు. బోర్డు ముసాయిదాలోనూ ఈ ప్రతిపాదనే ఉందన్నారు. విభజన చట్టం అమలునే తాము కోరుతున్నామని, తెలంగాణ వాటాలోని చుక్కనీరు కూడా ఆంధ్రకు అవసరం లేదన్నారు. మా రైతుల కోసం పొరుగు రాష్ట్రం రైతుల కళ్లుబొడిచే గుణం తమది కాదన్నారు. రెండు రాష్ట్రాలతో చర్చించిన తరువాతే కృష్ణా బోర్డు ముసాయిదా రూపొందించి కేంద్రానికి ప్రతిపాదించిందన్నారు. దిగువ రాష్టమ్రైన ఏపీ ప్రయోజనాలు కాపాడుకుంటామన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు బచావత్ ట్రిబ్యునల్ అమల్లో ఉంటుంది కనుక, దానే్న అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిజేష్ తీర్పు వచ్చేంతవరకూ బచావత్ అమలు చేయొద్దని తెలంగాణ వాదించడంలో అర్థం లేదన్నారు. నాగార్గునసాగర్‌ను తెలంగాణ చేతిలో పెడితే ఆంధ్ర పంటలు ఎండిపోవటంతోపాటు, ప్రజలకు తాగు నీరు కూడా లభించదని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ నీటి విడుదలకు ఆదాశాలొచ్చినా, టి ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ నీరు విడుదల చేయటం వలన ఏపీకి తీరని నష్టం వాటిల్లిందన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంచే కర్నాటక మీకు ఇష్టమా? అని తెలంగాణను నిలదీశారు. ఉమాభారతి విజ్ఞప్తి మేరకే హరీశ్‌తో చర్చించామని, అమర్‌జీత్ సింగ్‌తోనూ మాట్లాడినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటున్నామన్నారు. సాటి తెలుగోడి గొంతెండుతుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టటం న్యాయమా? అని ఉమ ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మంత్రులు అసత్యాలు చెప్పటం ఎంత వరకు న్యాయమని నిలదీశారు. కెసి కెనాల్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులనూ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని అంటున్నామని ఉమ స్పష్టం చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకూ బచావత్ ట్రిబ్యునల్‌ను అమలు చేయాల్సిందేనని, కెఆర్‌ఎంబి పరిధి నిర్దారించాల్సిందేనని ఉమ డిమాండ్ చేశారు.